కొద్దికాలం దేశీయ దిగ్గజం టాటా సన్స్ రథసారథుల్లో నెలకొన్న అపోహలు భారతీయ కార్పొరేట్ పరిశ్రమ పరువును అంతర్జాతీయ స్థాయిలో పలుచన చేయగా తాజాగా ఆ జాబితాలో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ చేరింది!దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన ఇన్ఫోసిస్ లో వ్యవస్థాపకులు - ప్రస్తుత మేనేజ్ మెంట్ కు మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయన్న వార్తలు గుప్పుమనడంతో కార్పొరేట్ రంగం ఉలిక్కిపడింది. ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా వేతనాన్ని భారీగా పెంచడంతోపాటు ఈమధ్య కంపెనీని వీడిన ఇద్దరు ఉన్నతోద్యోగులకు భారీ వీడ్కోలు ప్యాకేజీ చెల్లించడంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణమూర్తి - క్రిస్ గోపాలకృష్ణన్ - నందన్ నీలేకని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బోర్డుకు లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు పొక్కి కలకలం రేగిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ చైర్మన్ ఆర్ శేషసాయి రంగంలోకి దిగారు. సంస్థలో నిర్వహణ వైఫల్యాలపై వార్తలను ఖండించిన ఆయన సీఈఓ విశాల్ సిక్కా నిర్దేశించిన వ్యాపార వ్యూహానికి అనుగుణంగానే బోర్డు నిర్ణయాలు తీసుకుంటోందని, సంస్థను సమూలంగా మార్చాలన్న ఆయన ఆశయం ప్రసంశించదగినదని పేర్కొన్నారు. చాలా అంశాల్లో ఇన్ఫోసిస్ మిగతా ఐటీ సంస్థల కంటే ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోందని, మరింత వేగంగా పురోగతి సాధించగలిగేలా సంస్థను తీర్చిదిద్దేందుకు, షేర్ హోల్డర్ల వాటా విలువ పెంచేందుకు సిక్కా, బోర్డు కృషిచేస్తున్నట్లు శేషసాయి అన్నారు.
అయితే కంపెనీ మాజీ సీఎఫ్ వో మోహన్ దాస్ పాయ్ చేసిన వ్యాఖ్యలు చర్చ తీవ్రతను మరింత పెంచింది. కంపెనీ ప్రయోజనాల మేరకే ఆ నిర్ణయాలు తీసుకున్నామని బోర్డు సమర్థించుకుంటే సరిపోదని, ఈ విషయాలపై బోర్డు సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. ఇన్ఫోసిస్ ప్రమోటర్లు - వాటి కుటుంబ సభ్యుల పేరిట ప్రస్తుతం సంస్థలో 12.75 శాతం వాటా ఉంది. భారీ ప్యాకేజీల చెల్లింపుల విషయంపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. వ్యవస్థాపకుల నుంచి సూచనలను బోర్డు గౌరవిస్తుందని, అయితే బోర్డుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని తాజా స్టేట్ మెంట్ లో సంస్థ చెప్పకనే చెప్పింది. స్వతంత్రంగా వ్యవహరించడంతోపాటు షేర్ హోల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలన్న విశ్వాసపాత్రమైన బాధ్యతల నిర్వహణలో బోర్డు కట్టుబడి ఉంది అని సంస్థ స్పష్టం చేసింది.
కాగా... కంపెనీ పాలనతీరు - చిత్తశుద్ధి - విలువలను ప్రశ్నించే ఊహాగానాలకు కలత చెందవద్దని సిబ్బందికి ఇన్ఫోసిస్ సీఈవో సిక్కా హితవు పలికారు. కంపెనీ వ్యాపార లక్ష్య సాధనపైనే దృష్టిసారించాలని ఆయన పేర్కొన్నారు. 'ఇన్ఫోసిస్‌ను అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దే విషయంలో మన నిబద్ధత - ఉద్వేగం - దృఢసంకల్పం విషయంలో మారు తలంపునకు తావు లేదు. ప్రస్తుతం సంస్థలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు మన ఆశయాలపై ప్రభావం చూపరాదు. మనం సాధించబోతున్నాం. మనంకలిసికట్టుగా సాధిస్తాం' అని సిక్కా తన సహోద్యోగులకు రాసిన మెయిల్ లో పేర్కొన్నారు. కాగా, ఇన్ఫోసిస్ ప్రస్తుత మేనేజ్ మెంట్.. షేర్ హోల్డర్ల వాటా విలువను పెంచడంపై అంతగా దృష్టిసారించడం లేదని మోహన్‌దాస్ పాయ్ అన్నారు. అయితే సీఈవో విశాల్ సిక్కా నాయకత్వంపైన మాత్రం ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే ప్రస్తుతం సంస్థలకు అత్యంత సమర్థుడైన చైర్మన్ అవసరమని ఆయన పేర్కొన్నారు. కంపెనీ పగ్గాలు చేపట్టే బాధ్యతలను అప్పగించేందుకు నారాయణ మూర్తి ఎప్పుడూ వ్యవస్థాపక సభ్యులపైనే ఆధారపడి తప్పు చేశారనిపిస్తున్నదని పాయ్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా చాలామంది కంపెనీ వీడారన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/