కరోనా వైరస్ తో ప్రపంచం ఆగమాగం అవుతున్న వేళ.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా.. బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశాలకు దేశాలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ.. బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒకరు చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం రేపటమే కాదు.. అతనిపై కేసు నమోదయ్యేలా చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ఇన్ఫోసిస్ నిర్ణయం తీసుకుంది.
ఇంతకీ అతగాడు పెట్టిన పిచ్చ పోస్టు ఏమిటంటే.. అందరూ బయటకు వెళ్లండి. తుమ్మండి.. కరోనా వైరస్ ను వ్యాపింపజెయ్యండి అంటూ దారుణమైన రీతిలో పోస్టు పెట్టారు. అతను పెట్టిన పోస్టుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సదరు ఐటీ ఉద్యోగి పెట్టిన పైత్యపు పోస్టు వైరల్ కావటం.. బెంగళూరు సిటీ పోలీసుల వరకూ ఈ విషయం వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన అతడ్ని సిటీ క్రైం బ్రాంచ్ అరెస్టు చేసింది. ఈ విషయాన్ని జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ ప్రకటించారు.
తమ ఉద్యోగి పెట్టిన పోస్టు దుమారం రేగటం.. దానిలో తమ సంస్థ పేరు కూడా బయటకు రావటంతో ఇన్పోసిస్ స్పందించింది. అనుచితమైన పోస్టుపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన సంస్థ దర్యాప్తునకు ఆదేశించింది. కంపెనీ ప్రవర్తనా నియమావళికి.. బాధ్యతాయుతమైన తీరుకు భిన్నంగా ఉన్న ఉద్యోగి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇదంతా చూసినప్పుడు.. తిన్నది అరగక.. ఇంట్లో కూర్చొని పిచ్చ పిచ్చ పోస్టులు పెడితే.. ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటాయి మరి.