బ్రిట‌న్ మంత్రిగా...ఇన్ఫీ మూర్తి అల్లుడు

Update: 2018-01-10 10:14 GMT
భార‌తీయ పారిశ్రామిక దిగ్గ‌జం - ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి అనూహ్య తీపిక‌బురు ద‌క్కింది. ఆయ‌న అల్లుడికి బ్రిట‌న్‌ లో కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. ప్ర‌ధాని ప్ర‌ధాని థెరిసా మే ఇద్దరు భారతీయ సంతతి ఎంపీలకు తన క్యాబినెట్‌ లో స్థానం కల్పించారు. ఆ ఇద్దరిలో ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తి అల్లుడు రిషి సునక్ కూడా ఉన్నారు. కొత్తగా మంత్రి బాధ్యతలు దక్కిన భారతీయ సంతతి వారిలో రిషి సునక్‌ తో పాటు సుయెల్ల ఫెర్నాండేజ్ ఉన్నారు.

థెరిసా మేకు చెందిన కన్జర్వేటివ్ ప్రభుత్వం తాజాగా తన మంత్రిమండలిని విస్తరించింది. ఇందులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు సునక్ కు చోటు ద‌క్కింది. ఆయ‌న బ్రిటన్ ప్రభుత్వంలో హౌజింగ్ శాఖ మంత్రిగా చేయ‌నున్నారు. నార్త్ యార్క్‌ షైర్‌ లోని రిచ్‌ మండ్ నుంచి 2015లో తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 మళ్లీ ఎన్నికయ్యారు. 37 ఏళ్ల రిషి సునక్.. ఆక్స్‌ ఫర్డ్ - స్టాన్‌ ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. బెంగుళూరుకు చెందిన ఓ సిలికాన్ వ్యాలీ కంపెనీలో సునక్ పెట్టుబడులు ఉన్నాయి. స్టాన్‌ ఫర్డ్ వర్సిటీలో నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తితో సునక్‌ కు పరిచయమైంది. వారి పరిచయం ప్రేమగా మారడంతో ఆమెను సునక్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కాగా, మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన మ‌రో ఎంపీ ఫెర్నాండేజ్ పూర్వీకులు గోవాకు చెందినవారు. మరికొంత మంది ఇతర బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది. కాగా, భారతీయ సంతతి ఎంపీలు ఇద్దరూ బ్రిగ్జిట్‌ కు అనుకూలంగా ఓటేశారు.
Tags:    

Similar News