ఇన్ఫోసిస్ లో 2 వేలమంది అమెరికన్లకు ఉద్యోగాలు

Update: 2017-05-03 10:12 GMT
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది. అమెరికాలో నడుస్తున్న ఐటీ కంపెనీలన్నీ అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటోంది. హెచ్-1 బి వీసాల విషయంలో నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొనడంతో ఐటీ కంపెనీలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ఇన్ఫోసిస్.. టీసీఎస్.. విప్రో తదితర అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇండియా నుంచి అమెరికాకు వచ్చే ఐటీ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండటంతో వర్క్ లోడ్ ను తట్టుకోవడం కష్టమవుతుండటంతో అమెరికన్లకు హైర్ చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇన్ఫోసిన్ త్వరలోనే 2 వేలమంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆ సంస్థ సీఈవో విశాల్ సిక్కా ప్రకటించాడు. రాబోయే కొన్నేళ్లలో మొత్తంగా 10 వేల ఉద్యోగాల్ని అమెరికన్లకు ఇవ్వనున్న ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోసిస్ సంస్థలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరిలో మెజారిటీ ఎంప్లాయీస్ ఇండియన్సే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రంప్ ‘బయ్ అమెరికన్.. హైర్ అమెరికన్’ అంటుంటే ఎన్నికలకు ముందు ఇలాంటి నినాదాలు మామూలే అని.. తర్వాత అంత పట్టుదలతో ఉండడులే అని లైట్ తీసుకున్నాయి కంపెనీలు. కానీ అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తున్న ట్రంప్.. భారతీయుల అవకాశాలకు బాగానే గండికొడుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News