ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు - పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిన సైకో సూదిగాడి వ్యవహారం కాస్త సద్దుమణిగింది అనుకుంటున్న టైంలో శుక్రవారం మరో సైకో దాడి జరిగింది. నిన్నటి వరకు పశ్చిమగోదావరి జిల్లాతో పాటు తూర్పుగోదావరిలోని కోనసీమ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని జనాలపై దాడులకు పాల్పడ్డ వీరు ఈ సారి ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గం అయిన పెద్దాపురాన్ని టార్గెట్ గా చేసుకున్నారు. ఇప్పటికే పెద్దాపురంలో పది రోజుల క్రిందట ఓ వ్యక్తి పై సైకో సూదిగాడు దాడి చేయగా తాజాగా అదే నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో మరో వ్యక్తి పై ఇంజెక్షన్ దాడి జరిగింది.
వేట్లపాలెం కెనాల్ రోడ్ కు చెందిన శ్రీనివాస్ (47) అనే వ్యక్తి తాపీమేస్ర్తిగా పని చేస్తున్నాడు. శుక్రవారం విధులు నిర్వహించుకుని బైక్ పై ఇంటికి వెళుతున్నాడు. ఆ టైంలో వెనక నుంచి బైక్ పై వచ్చిన ఓ లేడీ, ఓ జంట్ కలిసి అతడి వీపుమీద సూదిగుచ్చి పారిపోయారు. ఊహించని ఈ సంఘటనతో షాక్ కు గురైన శ్రీనివాస్ 108కు ఫోన్ చేయడంతో వారు వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేశారు.
దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నిన్నటి వరకు సైకో సూదిగాడు దాడులకు పాల్పడుతుండగా..ఈ సారి లేడీ, జంట్ కలిసి సూదితో దాడి చేయడం సంచలనంగా మారింది. సాక్షాత్తు రాష్ర్ట హోం మంత్రి ప్రాధినిత్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ దాడి జరగడం మరింత చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలో 22కు పైగా సూది దాడులు జరగగా..తెలంగాణలో కోదాడ - హుజూర్ నగర్ - మల్కాజ్ గిరి ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. ఈ సైకో సూది దాడులకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో .. ఈ దాడులు ఎవ్వరు చేస్తున్నారో ఇప్పటకీ అంతుపట్టడం లేదు.