హైకోర్టులో ఏ4 సైజు పేపర్‌ వాడకంపై విచారణ !

Update: 2021-11-18 07:33 GMT
మాములుగా బయట షాప్స్ లో కానీ సాధారణ ఆఫీసుల్లో కానీ ఏ4 సైజు పేపర్‌ ను వాడితే. కోర్టులు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయలు వంటి ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏ4 కంటే కాస్త పొడవైన పేపర్లు వాడుతుంటారు. అయితే, హైకోర్టులో ఏ4 సైజు పేపర్‌ ను ఉపయోగించడం పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.

తెలంగాణ హైకోర్టు మరియు అన్ని సబార్డినేట్ కోర్టులలో అన్ని న్యాయపరమైన ప్రయోజనాల కోసం రెండు వైపులా రాసిన ఏ4 సైజు పేపర్లను మాత్రమే ఉపయోగించాలంటూ మయూర్ ముంద్రా అనే న్యాయవాది రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై హైకోర్టు ప్యానెల్ విచారించింది. అయితే, పేపర్‌ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అది కాలుష్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాదించారు పిటిషనర్, ఉత్పత్తి సమయంలో క్లోరిన్ ఆధారిత బ్లీచ్‌లను ఉపయోగిస్తారని, దీని ఫలితంగా మన నీరు, గాలి మరియు మట్టిలోకి విష పదార్థాలు విడుదలవుతాయని పిటిషన్‌ వాదనలు వినిపించారు.

ఇక, గత 2 దశాబ్దాలలో దాదాపు 386 మిలియన్ హెక్టార్ల అటవీప్రాంతం కోల్పోయామని, ఇది కలప పంటను కోల్పోవడానికి దారితీసిందని తెలిపారు.

దీనిపై స్పందించిన హైకోర్టు , పేపర్ అవసరాల నిమితం పొదుపుగా వాడాలని, ఏ4 సైజు పేపర్లను రెండు వైపుల పూర్తిగా వినియోగించాలని, ఒకవైపు మాత్రమే వాడరాదని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ సర్క్యులర్‌ను కూడా వెంటనే జారీ చేయబడుతుంది ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది, వాతావరణం, అడవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేసింది హైకోర్టు.
Tags:    

Similar News