ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో 25 కోట్ల డీల్ పై విచారణ?

Update: 2021-11-15 06:50 GMT
బాలీవుడ్ ఇండస్ట్రీ నిత్యం వివాదాలతో రచ్చకెక్కుతోంది. తెర ముందు ఆదర్శవంతులుగా కన్పించే నటీనటులు తెరవెనుక మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. వీళ్ల దారిలోనే వారి కుటుంబ సభ్యులు సైతం నడుస్తుండటం విశేషం. మెట్రో నగరాల్లో ఇటీవలీ కాలంలో డ్రగ్ కల్చర్ బాగా పెరిగింది. ముఖ్యంగా నిషేధిత డ్రగ్స్ సెలబ్రెటీలకు తోడు సామాన్యులకు సైతం అందుబాటులో లభిస్తుండటం ఆందోళన రేపుతోంది.

మత్తు పదర్థాలకు సెలబెట్రీలు బానిసలుగా మారుతున్నారనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలోనూ చాలామంది సెలబ్రెటీలు డ్రగ్స్ కోరల్లో చిక్కుకొని వారి జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమార్ ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేగింది. అయితే ఆర్యన్ ఖాన్ ను కావాలనే కొందరు ఈ కేసులో ఇరికించారనే టాక్ సైతం నడుస్తోంది.  

డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్ ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అతడి బెయిల్ కు సంబంధించి భారీ మొత్తంలో డీల్ జరిగిందనే ఆరోపణలు విన్పించాయి. ఈ కేసును విచారిస్తున్న ఎన్సీబీ అధికారి వాఖండే ఆర్యన్ ఖాన్ ను ఇందులో నుంచి తప్పించడానికి ఏకంగా 25కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్నారనే ప్రచారం జరిగింది. దీంతోనే అతడిని ఈ కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు విన్పించాయి.

అప్పటికే ఈ కేసు అనేక పలుపులు తిరుగుతోంది. అయితే ఈ భారీ డీల్ గురించి బయటికి పోకడంతో ఎన్సీబీ దీనిపై విచారణ చేపడుతోంది. ఈక్రమంలోనే ఈ డీల్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్న సామ్ డిసౌజా అకా సెన్విల్లే స్టాన్లీ డిసౌజా నేడు ఎంసీబీ సిట్ ముందు హాజరు కానున్నారు.

ఇలాంటి సమయంలోనే ఆర్యన్ ఖాన్ ను కేసు నుంచి తప్పించడానికి షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లాని.. కిరణ్ గోసావిని 25 కోట్ల డీల్ కుదుర్చుకోవడానికి సంప్రదించినట్లు సామ్ ఆరోపించాడు. ఈ మేరకు కిరణ్ గోసావి, దద్లానీ నుంచి 50 లక్షల రూపాయల మనీ తీసుకున్నారని కూడా సామ్ చెబుతున్నాడు.

నేడు జరిగే విచారణలో ఆర్యన్ ఖాన్ కేసును క్లోజ్ చేసేందుకు పూజా దద్లానీతో అలాంటి ఒప్పందం ఏదైనా జరిగిందా ? అని సామ్ డిసౌజా నుంచి ఎన్సీబీ ప్రయత్నిస్తోంది. అయితే గతంలో రెండు సార్లు సామ్‌కు సిట్‌ సమన్లు పంపినా హాజరు కాలేదు. దీనికి సంబంధించి శామ్ డిసౌజాను విచారించనున్నారు.

సిట్ సమన్ల ప్రకారం సోమవారం ఉదయం 9నుంచి 10గంటల మధ్య హాజరు కావాలని ఎన్సీబీ సామ్‌ను కోరింది. ఈ కేసులో ప్రభాకర్ సాయిల్ తర్వాత శామ్ డిసౌజా ప్రకటన చాలా కీలకం. కొన్నిరోజుల క్రితం కిరణ్ గోసావికి బాడీ గార్డ్ ప్రభాకర్ సెయిల్, గోసావి, సామ్ డిసౌజా మధ్య జరిగిన ఫోన్ సంభాషణను తాను విన్నానని పేర్కొన్నాడు.

ఆర్యన్ ఖాన్ కేసును క్లోజ్ చేసేందుకు 25 కోట్ల డీల్ కుదుర్చుకోవాలని గోసావి సామ్‌ను అడిగాడని చివరకు రూ.18కోట్ల డీల్ జరిగినట్లు ఆరోపించాడు. మరీ ఇందుకు సంబంధించిన విషయాలు నేడు విచారణలో వెలుగుచూస్తాయా? లేదంటే మరేదైనా ట్వీస్టులు ఉంటాయనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
Tags:    

Similar News