టీడీపీకి ఓటు వేయకపోతే చంపేస్తారా..?

Update: 2019-02-05 05:50 GMT
ఏ పార్టీ అయినా ప్రతీ ఒక్కరూ తమకే ఓటు వేయాలని కోరుకుంటారు. అందులే తప్పేం లేదు. అలా ఓటు వేసేందుకు, ప్రజల మెప్పు పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరేమో అభివృద్ధితో నిష్పక్షపాతంగా ఓట్లు అడుగుతారు. ఇంకొందరు డబ్బులిచ్చో, బెదిరించో ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్లు ఆ స్టేజ్  కూడా దాటేశారు. ఓటు కోసం ఒట్టు వేయించుకుంటున్నారు. ఒట్టు వేయకపోతే.. చావబాదుతున్నారు. అలాంటి సంఘటనే అనంతపురం జిల్లాలోని పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగింది.
                     
2019 ఎన్నికలకు ఎంతోదూరం లేదు. ఈసారి కూడా ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి. సర్వేలు చూస్తుంటే.. వైసీపీకి ఫేవర్ గా ఉన్నాయి. దీంతో.. టీడీపీ వర్గాల్లో అసంతృప్తి రోజురోజుకి పెరిగిపోతుంది. ఓటు వేస్తే సరే లేదంటే.. దాడులకు కూడా తెగబడుతున్నారు. జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులంతా కలిసి  వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుకే ఓటు వేయాలని డిమాండ్ చేసారు. పెన్షన్లు - డ్వాక్రా రుణాలు పెంచింది కేవలం ఓట్లు కోసమేనని.. అలాంటప్పుడు తమకే ఓట్లు వేయాలని వాదనకు దిగారు.  దీంతో.. కొంతమంది దానికి దీనికి సంబందం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏదైనా డ్వాక్రా రుణాలు - పెన్షన్లు ఇవ్వాల్సిందేనని.. అదేం టీడీపీ కార్యకర్తల సొమ్ము కాదని అడిగారు. దీంతో.. టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ చావచితక్కొట్టారు. ప్రస్తుతం బాధితులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొన్నటికి మొన్న ఆటోడ్రైవర్లతో బలవంతంగా థ్యాంక్స్ చెప్పించుకున్నారు సీఎం చంద్రబాబు. నిన్నటికి నిన్న అచ్చెన్నాయుడు.. డబ్బులు దొబ్బుతున్నారు కాబట్టి ఓటెందుకు వెయ్యరు అని అడిగారు. చూస్తుంటే.. టీడీపీ నాయకుల్లో అసహనం రోజురోజుకి పెరిగిపోతున్నట్లు కన్పిస్తుంది.


Tags:    

Similar News