లోకేష్ మెడకు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉచ్చు?

Update: 2020-12-03 16:30 GMT
అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉచ్చు నారా లోకేష్ మెడ చుట్టూ బిగుసుకుంటోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుపుతున్న సీఐడి అధికారులు భూ కుంభకోణంలో చంద్రబాబునాయుడు, లోకేష్ తో సహా ఎవరెవరి పాత్ర ఎంత అనే వివరాలను ఆధారాలతో సహా హైకోర్టు ముందుంచారు.

తమ దర్యాప్తులో వెలుగు చూసిన ఆధరాలుగా సీఐడి అధికారులు భూ కొనుగోళ్ళకు సంబంధంచి విదేశాలతో కొందరు సాగించిన వాట్సప్ సంభాషణలను - చంద్రబాబు - లోకేష్ తో భూకొనుగోళ్ళు జరిపిన వాళ్ళ వివరాలను అందించారు. అమరావతిని రాజదానిగా ప్రకటించే ముందే విజయవాడలోని లలితా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ పీవీ రాఘవ ఎలా భూములు కొన్నారనే విషయాన్ని చెప్పారట.

అలాగే చంద్రబాబు, లోకేష్ కు బాగా సన్నిహితుడైన కిలారు రాకేష్, ఆయన భార్య శ్రీహాస ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఎంతెంత భూములు కొన్నారనే విషయాలను కూడా ఆధారాలతో సహా డాక్యమెంట్లను కోర్టుకు సమర్పించారు. ప్రభత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ టీడీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు కొందరు అధికారులు, పిటీషనర్లు కలిసి పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడినట్లు వివరించారు. అమెరికా నుండి కూడా నిధులు తెప్పించి భూములు కొన్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాలంటే లోతుగా దర్యాప్తు చేయటానికి సీఐడికి అనుమతివ్వాలని కోరారు.

కిలారు రాజేష్ తరపు లాయర్ సిద్ధార్ధ లూథ్రా మాట్లాడుతూ తన క్లైంట్ కోర్ క్యాపిటిల్ ఏరియాకు బయటే భూములు కొనుగోలు చేశారు కాబట్టి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేందుకు ఆధారాలు లేవన్నారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనటం తప్పెలాగ అవుతుందని ప్రశ్నించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి రాజదానిగా ఉంటుందని వచ్చిన వార్తల ఆధారంగానే భూములు కొన్నారని వివరించారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మానవేంద్రరాయ్ మాట్లాడుతూ ప్రైవేటు భూముల్లో కొనుగోళ్ళు, అమ్మకాలు జరిగితే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటంటూ ప్రశ్నించారు.
Tags:    

Similar News