సోమవారం రాత్రి ఉన్నట్లుండి ఆగిన ఫేస్ బుక్.. ఇన్ స్టా.. వాట్సాప్ తో ఎంతటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందో అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇదే వారంలో మరోసారి ఫేస్ బుక్.. ఇన్ స్టాలో సాంకేతిక సమస్యలు ఎదురుకావటంతో.. తన సేవల్ని దాదాపు రెండు గంటల పాటు బంద్ అయ్యాయి. దీంతో.. వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు.
తమ సేవల అంతరాయంపై యూజర్లకు ఫేస్ బుక్ మరోసారి క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉండగా.. ఫేస్ బుక్.. ఇన్ స్టా సేవలు డౌన్ కావటంతో వాటి హ్యాష్ ట్యాగులు విపరీతంగా షేర్ కావటంతో ట్రెండింగ్ లో నడుస్తున్నాయి. ఫేస్ బుక్ డౌన్ అయిన ప్రతిసారీ.. దాని స్టేటస్ ఏమిటన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం ట్విటర్.. టెలిగ్రామ్ సర్వీసుల వైపు మళ్లుతున్నారు.
తాజాగా సేవలు నిలిచిపోవటానికి కారణం ఏమిటి? అన్న విషయం మీద మాత్రం స్పష్టత రాలేదు. అయితే.. సోమవారం ఏర్పడిన అంతరాయానికి.. తాజా అంతరాయానికి మాత్రం సంబంధం లేదని మాత్రం చెబుతున్నారు. సమస్యను పరిష్కరించామని.. ఇప్పుడంతా సర్దుకుందని మాత్రం ఫేస్ బుక్ ప్రకటించింది.
అంతేకాదు.. తమ సేవల అంతరాయంపై ఇన్ స్టా స్పందిస్తూ.. తమ కోసం ఓపికగా ఎదురుచూసినందుకు యూజర్లకు థ్యాంక్స్ చెప్పింది. వారం వ్యవధిలో రెండుసార్లు సేవలు అంతరాయానికి ప్రతిగా యూజర్లు మీమ్స్ తో విరుచుకుపడ్డారు. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతకీ తాజా సేవల అంతరాయానికి కారణం ఏమిటి? అన్న విషయాన్ని ఫేస్ బుక్ ఎందుకు చెప్పట్లేదు? అన్నది ప్రశ్నగా మారింది.