త‌లాక్ చెబితే మూడేళ్లు జైలుశిక్ష‌

Update: 2017-12-02 05:30 GMT
ప‌ట్టు చిక్కిన‌ప్పుడే మ‌రింత చోటు ద‌క్కించుకోవాలి. ఏ విష‌యంలో త‌మ‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని ద‌శాబ్దాలుగా ప‌లు రాజ‌కీయ పార్టీలు భ‌య‌ప‌డ్డాయో.. ఇప్పుడదే ఇష్యూతో భారీగా లాభ‌ప‌డాల‌ని భావిస్తోంది బీజేపీ. ట్రిపుల్ త‌లాక్ పై నిర్ణ‌యం తీసుకుంటే మైనార్టీల ఓటుబ్యాంక్ ప్ర‌భావితం అవుతుందన్న‌భ‌యాందోళ‌న‌ల‌తో ప‌లు రాజ‌కీయ పార్టీలు ఈ వ్య‌వ‌హారంపై అడుగు ముందుకు వేయ‌లేదు. అయితే.. ట్రిఫుల్ త‌లాక్ లో మ‌రో కోణాన్ని చూసింది మోడీ బ్యాచ్‌.

ట్రిపుల్ త‌లాక్ కార‌ణంగా ల‌బ్థి పొందేది ముస్లిం పురుషులే త‌ప్పించి.. మ‌హిళ‌లు కాద‌ని.. ఈ నేప‌థ్యంలో మైనార్టీ మ‌హిళ‌ల‌కు మేలు చేసేలా.. వారి మ‌న‌సు దోచుకునేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని మోడీ స‌ర్కారు భావించింది.

దీనికి త‌గ్గ‌ట్లే ట్రిపుల్ త‌లాక్ ఇష్యూలో మోడీ స‌ర్కారు అభిప్రాయానికి ముస్లిం మ‌హిళ‌లు అండ‌గా నిలిచారు. దీంతో.. ఈ వ్య‌వ‌హారంపై మ‌రింత దూకుడును పెంచిందిమోడీ స‌ర్కారు.

ట్రిపుల్ త‌లాక్ చెప్పే వారికి క‌ఠినంగా శిక్ష‌లు ప‌డేలా చ‌ట్టం త‌యారు చేయ‌టానికి వేగంగా పావులు క‌దుపుతోంది మోడీ స‌ర్కారు. ఇందులో భాగంగా పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో ఈ బిల్లును తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ట్రిపుల్ తలాక్ చెప్పే వారికి మూడేళ్ల జైలుశిక్ష‌తో పాటు.. భారీ జ‌రిమానా విధించేలా ప‌లు మార్పులు చేయాల‌ని భావిస్తోంది. దీంతో.. ముస్లిం మ‌హిళ‌ల భ‌విత‌కు భ‌రోసా ఇచ్చేలా ఉంటుంద‌ని మోడీ స‌ర్కారు భావిస్తోంది. తాజాగా ట్రిపుల్ త‌లాక్ చెప్పే వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలుగా బిల్లును సిద్ధం చేస్తున్నారు. న్యాయ‌.. హోం శాఖ‌లు సంయ‌క్తంగా రూపొందించిన ఈ బిల్లుపై మ‌రింత క‌స‌ర‌త్తుచేస్తోంది. ట్రిపుల్ త‌లాక్ చెప్పేందుకే భ‌య‌ప‌డేలా చ‌ట్టం ఉండాల‌న్న‌ది మోడీ స‌ర్కారు ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

ఈ అంశంపై తుది నిర్ణ‌యం తీసుకోవ‌టంతో పాటు.. ప‌లు రాష్ట్రాల అభిప్రాయాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా తుది ముసాయిదాను సిద్ధం చేస్తున్నారు. ముస్లిం మ‌త‌పెద్ద‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నా.. ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కుల్ని కాపాడే అవ‌కాశం ఉండ‌టంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ట్రిపుల్ త‌లాక్‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టం చేయాల‌ని భావిస్తోంది. ట్రిపుల్ త‌లాక్ మీద కేంద్రం ప్ర‌తిపాద‌న‌ను సుప్రీం కోర్టు వ్య‌తిరేకిస్తున్న కేంద్రం మాత్రం ఈ చ‌ట్టాన్ని రూపొందించాల‌ని భావిస్తోంది. మాట‌ల ద్వారా.. ఎస్ ఎంఎస్ లు.. ఈ మొయిల్‌.. వాట్స‌ప్ సందేశాల ద్వారా  ట్రిఫుల్ త‌లాక్ చెల్ల‌ద‌ని చెప్ప‌టమే త‌మ చ‌ట్టం ప్ర‌ధాన ఉద్దేశంగా చెబుతున్నారు.ఈ  బిల్లు కానీ పార్ల‌మెంటులో ఆమోదం పొందితే.. జ‌మ్ముక‌శ్మీర్ మిన‌హా దేశ వ్యాప్తంగా చ‌ట్టంగా మార‌నుంది.
Tags:    

Similar News