అమరావతి కోసం రాజీనామా అడిగే బదులు 3 రాజధానుల కోసం చేయొచ్చుగా?

Update: 2022-10-11 04:27 GMT
తెలివి తమకు మాత్రమే సొంతమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు రాజకీయ నాయకులు. వీరి తెలివిని చూసినప్పుడు తెల్లారినట్లుగా ఉంటుంది. పదునైన మాటలతో తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పడేసినట్లుగా ఫీల్ అవుతారు కానీ..

తామే అడ్డంగా బుక్ అయ్యామన్న అసలు విషయాన్ని మాత్రం మిస్ అవుతుంటారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఎపిసోడ్ ఇప్పుడు అదే తీరులో ఉందని చెప్పాలి. ఆయన మాట్లాడిన ప్రతిసారీ తనకు మించిన మేధావి లేరన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి.

తాను మాట్లాడే ప్రతి అంశంలోనూ లాజిక్ ఉందన్నట్లుగా భావించే ఆయన.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఆయన్ను వేలెత్తి చూపించటమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహించే అధికార వైసీపీని చిక్కుల్లో పడేస్తుంటాయి. తాజాగా అలాంటి పరిణామమే చోటు చేసుకుంది. మీడియాతో మాట్లాడిన సందర్బంగా ఆయన నోటి నుంచి వచ్చిన వాదన.. ఆయన్ను.. ఆయన పార్టీని ఇరుకున పడేసిన పరిస్థితి.

ఇంతకీ మహా మేధావిగా భావించే గుడివాడ వారి నోటి నుంచి వచ్చిన కీలక వ్యాఖ్య ఏమంటే.. అమరావతి కోసం ఉద్యమించే టీడీపీ నేతలు తమ పదవులుకు రాజీనామా చేసి.. ఎన్నికలకు రావొచ్చు కదా? ఫ్రెష్ గా తీర్పు కోరితే విషయం తేలిపోతుంది కదా? అన్న అమర్ నాథ్ మాటల్నే తీసుకుంటే..

అమరావతిని కొనసాగిస్తామని అదేపనిగా మాటలు చెప్పి.. బహిరంగ సభల్లో హామీలు ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ.. పవర్లోకి రావటం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా అన్నట్లుగా అమరావతి నుంచి మూడు రాజధానులకు షిప్టు అయ్యింది వైసీపీ సర్కారు.

ఇలాంటప్పుడు తాము చెప్పిన మాటలకు భిన్నంగా తమ చేతలు ఉన్నప్పుడు.. తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం తప్పనిసరి. ఏపీ రాజధానిగా అమరావతికి బదులుగా మూడు రాజధానులకు ఫిక్సు అయినప్పుడు.. అందుకు అనుగుణంగా తమ పదవులకు రాజీనామా చేసి.. తాజాగా తీర్పు కోరటానికి మించిన మంచి పని మరొకటి ఉండదు. తాము చేయాల్సిన పనిని.. తమ ప్రత్యర్థులు చేయాలని తలపోసే మంత్రి గుడివాడ లాంటి వారు ప్రజల్లో అభాసుపాలు అవుతారన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదంటున్నారు.

రాజకీయ ప్రత్యర్థుల్ని రాజీనామా చేయాలని కోరే బదులు.. మూడు రాజధానులకు దన్నుగా కీలక నేతలు రాజీనామాలు చేసి ప్రజాతీర్పు కోరితే సరిపోతుంది కదా? ఒకవేళ.. ప్రజలు మూడు రాజధానులకు తమ అంగీకారాన్ని తెలిపితే.. తెలుగుదేశంతో పాటు.. జనసేన.. బీజేపీ నేతలు గమ్మున ఉండిపోతారు కదా? అలా ఎందుకు చేయనట్లు అన్న ప్రశ్నను గుడివాడను అడిగితే ఆయనేం చెబుతారంటారు?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News