అధికారం, ఆధిపత్యమే అంతిమ లక్ష్యమైన రాజకీయానికి.. సిగ్గూ, బిడియం లాంటివి ఏవీ ఉండవు. దాని టార్గెట్ సాధించేందుకు ఎంతకైనా దిగుతుంది. దిగజారి పోతుంది. మన దేశంలో కుల, మత రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో కనీస అవగాహన ఉన్నవారందరికీ తెలిసిందే. దేశ ప్రజలను చీల్చేందుకు.. రెచ్చగొట్టే మత వ్యాఖ్యలు చేస్తుంటారు ఆయా పార్టీల నేతలు. ఇప్పుడు మరోసారి తన వాచాలత్వాన్ని ప్రదర్శించి.. వాంతి చేసుకున్నాడో బీజేపీ నాయకుడు. దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మరణించిన వేళ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై అన్ని వైపుల నుంచి విమర్శల జడి కురుస్తోంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు, కింగ్ ఆఫ్ ట్రాజెడీగా కీర్తిపొందిన దిలీప్ కుమార్ మరణించారు. సినీ పరిశ్రమకు ఈ దిగ్గజ నటుడు చేసిన సేవలను కీర్తిస్తూ.. సోషల్ మీడియా వేదికగా అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అయితే.. బీజేపీ హర్యానా ఐటీ, సోషల్ మీడియా ఇన్ చార్జ్ అరుణ్ యాదవ్ కూడా ఓ పోస్టు చేశారు. అందులో తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. బీజేపీపై ఇప్పటికే ఉన్న ఆరోపణలకు బలం చేకూర్చారు.
‘‘మొహ్మద్ యూసఫ్ ఖాన్ (దిలీప్ కుమార్) హిందూ పేరు పెట్టుకొని చిత్ర పరిశ్రమలో డబ్బులు సంపాదించారు. ఆయన మరణం నిజంగా భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశాడు అరుణ్ యాదవ్.
ఈ ట్వీట్ చూసిన వారంతా దుమ్మెత్తిపోస్తున్నారు. అరుణ్ యాదవ్ పై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ స్పందిస్తూ.. ‘నిన్ను చూస్తే సిగ్గేస్తోంది’ అని సమాధానం ఇచ్చారు. ఇంత జరుగుతున్నా.. అరుణ్ యాదవ్ కానీ, బీజేపీకి చెందిన ఇతరులు కానీ ఎవ్వరూ స్పందించలేదు. కానీసం.. ఆ ట్వీట్ కూడా తొలగించలేదు. ‘దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నారు’ అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.
దేశంలో హిందూ-ముస్లింలను వేరు చేసేందుకు బీజేపీ రాజకీయం చేస్తుందనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నవే. పలువురు బీజేపీ నేతలు తాము హిందువుల కోసం పనిచేస్తామన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే.. కళాకారులకు సైతం ఈ మతాన్ని పూసేందుకు ప్రయత్నించడంపై అందరూ మండిపడుతున్నారు. ఈ దేశాన్ని శాంతియుతంగా ఉండనివ్వరా? అని నిలదీస్తున్నారు.
ఈ మధ్యనే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఇదే విధంగా మతపరమైన వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ - కిరణ్ రావు విడాకులు తీసుకోగా.. దానిపై మాట్లాడుతూ.. అమీర్ కొడుకును హిందువుగా ఎందుకు పెంచలేదు.. అంటూ తలతిక్క ప్రశ్న వేసింది. హిందూ ముస్లింలు పెళ్లిళ్లు జరిగితే.. వారసులను ముస్లింలుగానే పెంచుతున్నారంటూ వ్యాఖ్యానించింది. వాళ్ల విడాకుల వేళ ఇలాంటి ప్రేలాపనలు ఏంటనే విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు అరుణ్ యాదవ్ అనే వ్యక్తి.. దిలీప్ కుమార్ పై ఇలా నోరు పారేసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మత విద్వేషాలు రగిలించే ప్రయత్నాలను బీజేపీ సోషల్ మీడియా వింగ్ కొనసాగిస్తోందని ఇతర రాజకీయ పార్టీలు ఎంతో కాలంగా విమర్శిస్తున్నాయి. వీటికి కొనసాగింపు అన్నట్టుగా.. బీజేపీ హర్యానా ఐటీ, సోషల్ మీడియా ఇన్ చార్జ్ అరుణ్ యాదవ్ దిలీప్ కుమార్ పై మతపరమైన పోస్టు చేయడం గమనార్హం. మొత్తంగా.. మత రాజకీయాలు చేసేందుకు ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి, దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.