రాజధానిలో సెన్సర్ల విధానంలో నూతన ట్రాఫిక్ మేనేజ్ మెంట్ పద్ధతిని ప్రారంభించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా సెన్సర్ల ఆధారంతో పని చేసే వ్యవస్థతో ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని భావిస్తోంది.
ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ పూర్తిగా యంత్రాల ద్వారా సాగుతుంది. లైవ్ ట్రాఫిక్ డెన్సిటీ - రోడ్ కెపాసిటీ - ఎక్స్ టర్నల్ ఫ్యాక్టర్స్ - సిటీ రోడ్ నెట్ వర్క్ - టోపోగ్రఫీ వ్యవస్థల ద్వారా దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ మేనేజ్ మెంట్ జరుగుతోంది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద నైట్ విజన్ కెమెరాలు, సెన్సర్లను ఏర్పాటు చేసి వాటిని ట్రాఫిక్ కంట్రోల్ రూం నుంచి మానిటరింగ్ చేస్తారు. తద్వారా రద్దీ నియంత్రణ హెచ్ ట్రిమ్స్ విధానంలో జరుగుతుంది. ఈ విధానంలో నాలుగు రోడ్ల కూడలిలో నాలుగు పక్కలా ఉన్న కెమెరాలు రెండు కిలోమీటర్ల మేర ఫొటోలు తీసి కంట్రోల్ రూమ్ కు పంపుతాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నవైపు సిగ్నల్ ను ఎంత సమయంపాటు వదలాలనే నిర్ణయాన్ని ఇంటెలిజెంట్ సిస్టం ద్వారా ఆటోమేటిక్ గా యంత్రాలే నిర్ణయిస్తాయి. ఇందుకు మినిమమ్ - మాగ్జిమమ్ సమయాలను మాన్యువల్ గా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఉన్న లోపాలను సవరించి ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టంను పలు సాప్ట్ వేర్ సంస్థలు రూపొందించాయి.
విజయవాడలో తొలి దశలో 54 జంక్షన్ లలో దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పోలీసు శాఖ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.