అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ అంశంలో మరో కొత్త కోణం తెరమీదకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విక్టరీ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయపడ్డారని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపించే విధంగా ప్రచారం నిర్వహించాలని రష్యా నేత పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు. కానీ గతంలో ఆ ఆరోపణలను కొట్టిపారేసింది.
ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికపై ట్రంప్ స్పందించారు. ఎన్నికల్లో రష్యా జోక్యం కల్పించుకుందన్న అంశంపై ఆయన మాట్లాడలేదు. కానీ అమెరికా ఎన్నికల ఫలితాలపై ఆ ప్రభావం పడలేదన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు హ్యాకింగ్ కు సంబంధించి 25 పేజీల రిపోర్ట్ ను తయారు చేశారు. ట్రంప్ విక్టరీ కోసం రష్యా పనిచేసినట్లు ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇదిలాఉండగా... ప్రస్తుత దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా రాజకీయ కోణంలో నియమించిన దౌత్యవేత్తలెవరినీ కొనసాగించకూడదని డోనాల్డ్ ట్రంప్ అధికార మార్పిడి బృందం నిర్ణయించింది. ట్రంప్ ప్రమాణస్వీకారం రోజు(ఈ నెల 20న)నాటికే విధుల నుంచి తప్పుకోవాలని.. అదనపు వెసులుబాటు కాలాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రకటించింది. గత 8 ఏళ్లలో వందలాదిమంది దౌత్యవేత్తలను ఒబామా నామినేట్ చేశారు. వారిలో సుమారు 30 మంది రాజకీయకోణంలో నియమితులయ్యారు. ట్రంప్ బృందం తాజా నిర్ణయంతో వారంతా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇందులో భారత రాయబారి రిచర్డ్ వర్మ సైతం ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/