మిస్టరీ మృతి .. ఫ్రెండ్ రూమ్ కి వెళ్లి , ఫ్యాన్ కి వ్రేలాడుతూ కనిపించింది !
దేశంలో రోజులో ఎక్కడో ఓ చోట ఏదో ఒక ఘటన వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా హైదరాబాద్ లో కూడా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. స్నేహితుడి ఇంటికి వెళ్లిన యువతి చివరికి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించడం అందరిని షాక్ కి గురిచేసింది. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న కూతురు సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు షాక్ లోకి వెళ్లిపోయారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే .. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రవీణ అనే 19 ఏళ్ల యువతి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. కుటుంబంతో కలిసి పాండురంగ నగర్ లో నివాసం ఉంటుంది. ఓ ప్రయివేట్ కళాశాల ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువతికి ... శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఇక ఆ తర్వాత శ్రీకాంత్ అనే యువకుడితో పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. అప్పుడప్పుడు ప్రవీణ శ్రీకాంత్ ను కలిసేందుకు గదికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలోనే ఇటీవలే తన స్నేహితుడి ఎంగేజ్మెంట్ ఉంది అంటూ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పిన ప్రవీణ శ్రీకాంత్ ను కలిసేందుకు గదికి వెళ్ళింది. శ్రీకాంత్ గదిలో లేకపోవడంతో ఫోన్ చేయగా తన సొంత ఊర్లో ఉన్నాను అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత శ్రీకాంత్ రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చి గది తలుపులు తెరిచే సరికి ఒక్కసారిగా షాక్. సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ప్రవీణ వేలాడుతూ కనిపించింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గదికి తాళం పెట్టి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.