బైడెన్ వైఫ్.. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు?

Update: 2020-11-10 02:30 GMT
తీవ్ర ఉత్కంట రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం తేలిపోయింది. తదుపరి అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష పదవికి ఎంత గ్రేస్ ఉంటుందో.. ప్రపంచంలో మరే అధ్యక్షుడి సతీమణి (జిల్ బైడెన్) కి లేని ప్రాధాన్యత అమెరికా ఫస్ట్ లేడీకి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత కాబోయే ఫస్ట్ లేడీ మీద అమెరికన్లు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆమె ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. కారణం.. ఆమె వ్యక్తిత్వమే. గతంలో బైడెన్ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న వేళలో ఉపాధ్యక్షుడి సతీమణి హోదాలో ఉంటూ కూడా తనకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని వదల్లేదు.

అంతేకాదు.. దేశాధ్యక్షపదవిలో భర్త ఉన్నప్పటికీ.. తన అధ్యాపక వృత్తిని కొనసాగిస్తానన్న మాట ఆమె నోట రావటం ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో భర్త ఉన్నప్పటికీ.. తనకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని వదలటానికి ఇష్టపడని ఆమె తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటాలియన్ మూలాలున్న జిల్ అమెరికాలో స్థిరపడ్డారు. పిలెడెల్ఫియాలో 1951లో పుట్టిన ఆమె.. ఎంతోకాలంగా ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఇప్పటికి టీచింగ్ అంటే ఆమెకు ప్రాణం. డాక్టరేట్ చేసిన జిల్.. ఇప్పటికి పాఠాలు చెప్పేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇలాంటి ఫస్ట్ లేడీ.. ఇక ముందు వస్తుందో లేదో?
Tags:    

Similar News