ఎవరీ ప్రసిద్ధ్​ కృష్ణ.. ఇతడి బ్యాక్ ​గ్రౌండ్​ ఏమిటి?

Update: 2021-03-26 03:46 GMT
ఇంగ్లాండ్​ జరిగిన తొలి వన్డేలోనే నాలుగు వికెట్లు పడగొట్టి.. టీ మిండియా గెలుపులో ఎంతో కీలకంగా వ్యవహరించాడు ప్రసిద్ధ్​ కృష్ణ. అయితే ప్రసిద్ధ్​ కృష్ణ ఎవరు? ఇతడి బ్యాక్​ గ్రౌండ్​ ఏమిటో తెలుసుకుందాం.. నిజానికి ప్రసిద్ధ్​ కృష్ణ.. ఆస్ట్రేలియాలో రాటుదేలాడు. ఆస్ట్రేలియా బౌలర్లు అతడికి ట్రైనింగ్​ ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్​ బ్యాట్స్​మెన్​ కు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ప్రసిద్ధ్​ కు ఆసీస్​ లెజెండరీ పేసర్​ జేఫ్​ థామ్సన్​ కోచింగ్​ ఇచ్చాడు. థామ్సన్​ శిష్యరికంలో రాటు దేలాడు. అయితే ప్రసిద్ధ్​ కు బౌలింగ్​ లో మెళకువలు మొత్తం జెఫ్​ థామ్సన్​ నే ఇచ్చాడట.. ప్రసిద్ధ్​ చాలా కాలం పాటు ఆస్ట్రేలియా పిచ్​ల పై బౌలింగ్​ లో ప్రాక్టీస్​ చేశాడు. ఆ తర్వాత ఫేస్​ బౌలర్ ​గా రాణించాడు. స్వతహాగా బ్రెట్ ​లీ బౌలింగ్​ ను ఇష్టపడే ప్రసిద్ధ్​ ఆసీస్​ బౌలర్ల శిక్షణ లో ట్రైనింగ్​ తీసుకోవడం గమనార్హం.

ఆస్ట్రేలియాలోని ఎంఆర్‌ ఎఫ్ అకాడమీలో ఆసీస్ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ పేసర్‌ గ్లెన్ మెక్‌ గ్రాత్ వద్ద కూడా ప్రసిద్ధ్​ శిక్షణ తీసుకున్నాడట. ప్రసిద్ధ్​ స్వస్థలం కర్ణాటక. అనంతరం ఆస్ట్రేలియాకు  వెళ్లి అక్కడి క్రికెట్​ లో కఠోర సాధన చేశాడు. ప్రస్తుతం అతడు టీమిండియా ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ప్రసిద్ధ్​ బౌలింగ్​ ఆసీస్​ బౌలర్లను తలపిస్తున్నదని.. సీనియర్​ బ్యాట్స్​మన్లకు సైతం కొరుకుడు పడటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  పూణేలోని ఎమ్‌సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్‌ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ ను అందుకున్న ప్రసిద్ద్‌‌.. మ్యాచ్‌ ను మలుపు తిప్పే ప్రదర్శన తో అదరగొట్టాడు.

తొలి వన్డేలోనే ప్రసిద్ద్​ తన రేంజ్​ చూపించాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్‌ (1)ను ఔట్‌ చేశాడు. ఆ తరువాత మిడిల్‌ ఓవర్ల లో సామ్‌ బిల్లింగ్స్‌ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్‌  ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్‌ చేసిన అతడు .. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రం లో ఏ భారత బౌలర్‌ కు సాధ్య పడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు.
Tags:    

Similar News