విశాఖపట్నంలో సంచలనం కలిగించిన దివ్య హత్య కేసు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే విశాఖ పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేసి ఎట్టకేలకు ఛేదించారు. ఆమె హత్యకు గురయిందని తేల్చి ఆమెను హత్య చేసిన నిందితులను అరెస్టు చేశారు. జూన్ 3వ తేదీ బుధవారం రాత్రి దివ్య హత్య గురయిన విషయం తెలిసిందే. మృతదేహంపై 33 చోట్ల గాయాలుండడంతో కేసు సంచలనంగా మారింది. దివ్యను చిత్రహింసలకు గురిచేసి హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించుకుని విచారణ చేపట్టారు. చివరకు ఆమెను ఓ మహిళ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పోలీసుల వివరాల ప్రకారం...
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్య (20) తల్లితండ్రులను కోల్పోయింది. ఈ క్రమంలో బతుకుదెరువు కోసం విశాఖపట్నంలోని వసంత (30) దగ్గరకు వచ్చింది. అయితే ఆమె అప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో పరిచయమైన దివ్యను వ్యభిచార వృత్తిలోకి దింపాలని నిర్ణయించి తన ఇంటికి తీసుకెళ్లింది. దివ్య అందంగా ఉండడంతో పాడు వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమెతో వ్యభిచారం మొదలెట్టింది. దివ్య అందాన్ని ఎరగా వేసి వసంత బాగా డబ్బులు సంపాదించింది. ఈ క్రమంలో అందంగా ఉన్న దివ్యను చూసి వసంతకు అసూయ, ద్వేషాలు పెరిగింది. దీంతో ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో దివ్యను అందవిహీనంగా చేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా దివ్యను ఇంట్లో బంధించి వారం రోజుల పాటు వసంత చిత్రహింసలకు గురి చేసింది. ఈ బాధలు భరించలేక పరిస్థితి విషమించి దివ్య మృతిచెందింది.
తెల్లారి దివ్య ఫిట్స్‌తో మరణించిందని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో శ్మశాన వాటిక వారికి సమాచారం ఇచ్చింది. జ్ఞానాపురం ప్రాంతంలోని అంతిమ యాత్ర వాహనం వ్యక్తి మృతదేహం వివరాలన్నీ తెలుసుకున్నాడు. దీంతో అనుమానం వచ్చిన వాహన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె మృతి అనుమానాస్పదంగా పోలీసుగు గుర్తించారు. దివ్య మృతదేహంపై గాయాలు ఉండడంతో వెంటనే మృతదేహం పోస్టుమార్టానికి తరలించారు. విచారణలో భాగంగా పోలీసు జాగిలాలను తీసుకురాగా అవి వసంత, ఆమె సోదరి మంజుల చుట్టూ తిరిగాయి. దీంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు ఈ కేసులో వసంత మరిదిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా దివ్య నేపథ్యం పోలీసులు తెలుసుకున్నారు. దివ్య కుటుంబం 2015 లో హత్యకు గురైనట్లు విచారణలో తేలింది. దివ్య తల్లి, తమ్ముడు అమ్మమ్మలను కూడా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. వారి హత్యకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. దివ్య కుటుంబమంతా హత్యకు గురి కావడం సంచలనం రేపుతోంది. ఇప్పుడు మొత్తం ఆ హత్యలపైన పోలీసులు విచారణ చేస్తున్నారు.