ఇప్పుడు ఏం చేసినా ఆన్ లైన్.. ఏం కొన్నా ఆన్ లైన్.. ఏది కావాలన్నా ఆన్ లైన్. స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటే చాలు ఫుడ్ ఆర్డర్ నుంచి ఇంటి క్లీనింగ్ వరకు ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. అంతేకాదు ఇక అరచేతిలో ఫోన్ పట్టుకొని లక్షల రూపాయల షాపింగ్ చేసేస్తున్నారు. ఇల్లు, ఆఫీస్, బస్ స్టాప్, ఏ ఇతర ప్రాంతాల్లో ఉండి అయినా షాపింగ్ చేసుకునే వెసలుబాటు వచ్చింది. ఇక ఎవరు ఊరుకుంటారు చెప్పండి. అందరూ ఫుల్లుగా కొనేస్తున్నారట. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సరదా కోసం కూడా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫలితంగా ఈ-కామర్స్ రంగం ఊపందుకుంది. దాదాపు ఐదేళ్ల నుంచి యమా జోరుగా సాగుతోంది.
భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. బయటి షాపుల్లోకి వెళ్లడం వల్ల అటు సమయం, ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర ఖర్చులు అవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. పైగా ఒక్కటి కొనాలని వెళ్లి రెండు కొంటున్నారనేది ఇంకొందరి సమస్య. అందుకే ఎంచక్కా చేతిలోని ఫోన్ లో నచ్చి వస్తువును ఎంపిక చేసుకొని బుక్ చేసుకోవడం చాలా సులభంగా ఉందని ఆ సర్వే ఫలితాల్లో వెల్లడైంది. పైగా మనదేశంలో ఫెస్టివల్స్ ఎక్కువ. సాధారణంగా పండుగులు, ఇతర స్పెషల్ ప్రోగ్రాంలు ఇలా ఎప్పుడూ ఏవో ఉంటూనే ఉంటాయి. సో షాపింగ్ లు పెరిగాయి. బయట షాపులకు వెళ్లి కొనాంటే ఇతరుల తోడు ఉండాలని చాలామంది కోరుకుంటారు. పైగా ఆ ట్రాఫిక్ లో వెళ్లడంపై అనాసక్తి. ఇక చాలా సమయం వెచ్చించాలి. ఇవేవి లేకుండా క్షణాల్లో ఆన్ లైన్ లో బుక్ చేస్తున్నారు. అందుకే ఆన్ లైన్ షాపింగ్ కు బాగా డిమాండ్ పెరిగింది.
ఆన్ లైన్ బిజినెస్, ఆన్ లైన్ షాపింగ్ వంటి అంశాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ నివేదికల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వెల్లడయ్యాయి. ప్రస్తుతం చాలామంది ఆన్ లైన్ షాపింగ్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఇకపోతే రాబోయే ఐదేళ్లలో రూ.37 లక్షల కోట్ల ఆన్ లైన్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేసింది. అంతేకాకుండా 2021 వరకు నగరాల్లో ఉండే కుటుంబాల్లో 2.4 కోట్ల కుటుంబాలు ఆన్ లైన్ షాపింగ్ ద్వారా కొంటారని పేర్కొంది. ప్రస్తుతం ఒక్కో ఫ్యామిలీ ఈ ఆన్ లైన్ షాపింగ్ కోసం 13-14వేల డాలర్లు ఖర్చు చేస్తున్నారని వెల్లడించింది. ఇక రాబోయే ఐదేళ్లలో అవి 19-20 వేల డాలర్లకు చేరుతాయని నివేదికల్లో ప్రస్తావించింది.
ఆన్ లైన్ షాపింగ్ కు మనదేశంలోనే ఎక్కువ గిరాకీ ఉండడం గమనార్హం. అయితే చాలామంది కూడా సులభంగా షాపింగ్ పూర్తి చేసుకోవడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. ఇకపోతే పండుగల వేళ ఈ-కామర్స్ సంస్థలు కూడా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫెస్టివల్ సీజన్ లో భారీగా ఆఫర్లు ప్రకటించడం, క్యాష్ బ్యాక్ ఇవ్వడం వంటివి బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి కొనాలని లేకపోయినా ఈ ఆఫర్ల కోసం షాపింగ్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. అందుకే రాబోయే ఐదేళ్లలో ఆన్ లైన్ షాపింగ్ యుగంగా మారే అవకాశం ఉందనే అంశాన్ని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.