కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా భారత్ జోడో యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాన్ని రాహుల్ చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జోడో యాత్రను పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోకి ఎంటరైన సంగతి తెల్సిందే.
ఈ జోడో యాత్రలో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పాల్గొని రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ ప్రజలకు మరింత చేరువవుతుందని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా సోమవారం నాడు కమల్ హాసన్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా కమల్ నటించిన ‘గాంధీ’ సినిమాతో పాటు చైనా దురాక్రమణ.. రష్యా-ఉక్రెయిన్ వార్.. పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కమల్ హాసన్ మాట్లాడుతూ మా నాన్న కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి అని చెప్పారు. తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా గాంధీజీని తీవ్రంగా వ్యతిరేకించానని కమల్ తెలిపారు. అయితే 25 ఏళ్ళ వయస్సు వచ్చాక గాంధీజీ గురించి సొంతంగా తెలుసుకునే ప్రయత్నం చేశానని చెప్పారు.
ఆ క్రమంలోనే గాంధీజీకి అభిమానిగా మారిపోయినట్లు కమల్ వెల్లడించారు. ఆ తర్వాతే తాను ‘హే రామ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించానని చెప్పాడు. ‘విమర్శకు అత్యంత దారుణమైన రూపం హత్య చేయడం.. ఇది చౌకబారు విధానమని నా అభిప్రాయం’ అంటూ కమల్ హాసన్ స్పష్టం చేశారు. అలాగే మత సామరస్యంపై మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలతో కలిసిన సమాజమే అభివృద్ది చెందుతుందని చెప్పారు.
రాహుల్ గాంధీ పలు అంశాలపై మాట్లాడుతూ 21వ శతాబ్దంలో భద్రత గురించి ప్రపంచ స్థాయి ఆలోచనా విధానం ఉండాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు వేస్తుందని తాను భావిస్తున్నానని రాహుల్ వ్యాఖ్యానించారు. చైనా మనదేశంలోకి సైన్యం చొరబడిందని సైన్యం చెబుతుంటే ప్రధాని మాత్రం ఎవరూ రాలేదంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో మనం ఏం చేసినా భారత్ స్పందించదనే సంకేతం చైనాకు వెళుతుందని రాహుల్ కేంద్రాన్ని విమర్శించారు.
ఉక్రెయిన్ పై రష్యా ఎలాంటి బెదిరింపులకు పాల్పడుతుంటే చైనా సైతం అలాగే భారత్ విషయంలో వ్యవహరిస్తుందని రాహుల్ అన్నారు. మీరు పశ్చిమ దేశాలతో సంబంధాలు కలిగి ఉంటే మేం మీ సరిహద్దులు మారుస్తామని ఉక్రెయిన్ ను రష్యా బెదిరిస్తుందన్నారు. చైనా విషయంలో భారత్ కు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. మీరు ఏం చేస్తున్నారో జాగ్రత్త. మీ భూభాగాలను మారుస్తాం.. లద్ధాఖ్ లోకి ప్రవేశిస్తాం.. అరుణాచల్ ప్రదేశ్ లోకి వస్తామంటూ చైనా చెప్పకనే చెబుతుందని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.