వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజును గతంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్ర సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిందుకు ఆయనను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు పోలీస్ కస్టడి విధించి అనేక కోణాల్లో విచారించారు.
అయితే ఈ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ విధించారని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆయన మీడియా ఎదుట వాపోయారు. ఆ తరువాత బెయిల్ తెచ్చుకున్న రఘురామ ఢిల్లీ వెళ్లారు. అయితే ఆయన కుమారుడు భరత్ తన తండ్రిపై జరిగిన దాడి విషయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా సుప్రీం కోర్టు ఈ పిటిషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఒక ప్రజాప్రతినిధి అయిన రఘురామ కృష్ణం రాజుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పిటిషనర్ తరుపున న్యాయవాది వాదించారు. అంతేకాకుండా ఈ కేసు విషయంలో సీబీఐని నియమించాలని, ఎంపీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేలా తీర్పు ఇవ్వాలని న్యాయవాది వాదించారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తికి నోటీసులు ఇవ్వకుండా పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారని, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఎంపీపై అనుచితంగా దాడి చేశారని అన్నారు.
అయితే ఈ వాదనపై సుప్రీంకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీనిపై సీబీఐ నియమించాలని అంటున్నారు.. ఇంత అంత ముఖ్యమైన కేసా..? అని ప్రశ్నించింది. సీబీఐ ముఖ్యమైన కేసులను మాత్రమే విచారిస్తుంది. చిన్నా చితకా కేసులకు కూడా సీబీఐ కావాలా..? అని తెలిపింది.
అయినా ఈ వ్యవహారం జరిగి 11 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి దాకా ఏం చేశారని ప్రశ్నించింది. అయితే దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రంకు సుప్రీం కోర్టు దాఖలు చేసింది. ఆ తరువాత రెండు వారాల్లోగా రిజాయిండర్ దాఖలు చేసుందుకు భరత్ కు అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మరోవైపు వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న రఘురామరాజుపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన పార్టీ ఎంపీగానే కొనసాగుతూ తన పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినా.. ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు ఆయన బీజేపీలో చేరుతారని అంటున్నారు. కానీ ఎంపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వైసీపీకి ఆయన రాజీనామా చేస్తారా..? లేక పార్టీలోనే ఉంటూ జగన్ పై విమర్శలు పెంచుతారా..? అనేది ఆసక్తిగా మారింది.