బ‌డ్జెట్` బ్రీఫ్ కేస్ ఫొటో ఫోజు వెనుక సీక్రెట్ ఇదే!

Update: 2018-02-01 11:20 GMT
ఏడాదికోసారి....దేశ ప్ర‌జ‌ల త‌ల‌రాత‌లు మార్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెడుతుంది. దాదాపు ఆరు నెల‌ల మేధోమ‌థ‌నం అనంత‌రం....పార్ల‌మెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెడ‌తారు. అయితే, ఆర్థిక మంత్రి ....పార్ల‌మెంట్ లోకి వెళ్లేముందు....బ‌డ్జెట్ పేప‌ర్లు ఉన్న లెద‌ర్ బ్రీఫ్ కేసును మీడియాకు చూపించి....ఫొటోలు దిగి మ‌రీ లోప‌లికెళ‌తారు. మామూలుగా ఫొటోల మాదిరిగా కాకుండా ప్ర‌త్యేకంగా ఆ బ్రీఫ్ కేసును మీడియా క‌వ‌ర్ చేయ‌డం వెనుక ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. భార‌త దేశానికి తొలి బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టిన ఓ పెద్దాయ‌న చేసిన పొర‌పాటును......ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూ.....ఆ ఫొటోకు ఆర్థిక మంత్రులు ఫోజిస్తున్నార‌ట‌.

దాదాపు 150 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఆర్థిక మంత్రులు కొన‌సాగిస్తున్నారు. బ్రిటీష్ హ‌యాంలో ....1869లో మ‌న మొద‌టి వార్షిక బడ్జెట్ ను జార్జి వార్డ్ హంట్ అనే పెద్దాయ‌న ప్రవేశపెట్టాడు. బడ్జెట్ ప్రతులను ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర మరిచిపోయి సభకు వ‌చ్చాడు. లోప‌లికి వెళ్లాక చూస్తే బడ్జెట్ పేపర్లు త‌న ద‌గ్గ‌ర లేవు. తాను ఆ పేప‌ర్ల‌ను ఇంటి ద‌గ్గ‌రే మ‌ర‌చిపోయి వచ్చానని ఆయ‌న‌కు గుర్తుకువ‌చ్చింది. ఈ ఘ‌ట‌న మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా.....మ‌రుస‌టి ఏడాది నుంచి బడ్జెట్ పత్రాలున్న బ్రీఫ్‌ కేస్ ను మర్చిపోలేదన‌డానికి గుర్తుగా .....ఆ బ్రీఫ్ కేసును ఆర్థిక మంత్రులు మీడియాకు చూపించి ఫొటోదిగి మ‌రీ పార్ల‌మెంట్ లోకి వెళ్ల‌డం ఆన‌వాయితీ. ఈ విధంగా ఆ పెద్దాయ‌న చేసిన పొర‌పాటు....సంప్ర‌దాయంగా మారి నేటికీ కొన‌సాగుతోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ‌రుస‌గా ఐదో బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రసంగం ఇంగ్లీషులో మాత్ర‌మే జ‌రిగేది. అయితే, ట్రెండ్ కు భిన్నంగా ఈసారి హిందీ - ఇంగ్లీష్.. రెండు భాషల్లో జైట్లీ అన‌ర్గ‌ళంగా ప్ర‌సంగించారు. గ్రామీణ ప్రజలు - రైతులకు అర్థమయ్యేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. సంప్రదాయానికి భిన్నంగా బడ్జెట్ ను రెండు భాషల్లో ప్రవేశపెట్టడం కూడా ఇదే తొలిసారి కావ‌డం విశేషం. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌, వ‌చ్చే ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో మోదీ స‌ర్కార్ కు ఆఖ‌రి బ‌డ్జెట్ కూడా ఇదే.

Tags:    

Similar News