మోడీకి పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ: ఇంటర్నేషనల్ మీడియా

Update: 2021-05-15 13:25 GMT
‘ఆహా మోడీ..’ ఓహో మోడీ.. ఇలా కరోనా మొదటి వేవ్ ను సమర్థంగా లాక్ డౌన్ పెట్టి ఆపేసిన భారత ప్రధానిని అంతర్జాతీయ మీడియా ఆకాశానికెత్తేసింది. నాడు ట్రంప్, యూరప్ ప్రధానుల వైఫల్యాన్ని తూర్పారపట్టాయి. కానీ నవ్విన నాపచేనే పండింది అన్నట్టుగా.. బాధితులుగా మారిన దేశాల వారు వ్యాక్సిన్లు, ముందస్తు చర్యలతో ఇప్పుడు సెకండ్ వేవ్ ను తప్పించుకున్నారు. మొదటి వేవ్ ను జయించిన మోడీ భారతదేశం రెండో వేవ్ కి బలైపోయింది. యాథా నిర్లక్ష్యం.. తథా శాపనార్థం అన్నట్టు మనం చేసిన తప్పులే మనకు చుట్టుకుంటాయని నానుడి మోడీ విషయంలో నిజమైందంటున్నారు.

 ఒకప్పుడు మోడీని వేయినోళ్లతో పొగిడిన అంతర్జాతీయ మీడియా ఇప్పుడు అదే మోడీ చేసిన తప్పులను ఎండగడుతూ కథనాలు రాస్తూ ఆయన పరువును తీస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ లో దేశంలో లాక్ డౌన్ పెట్టి కంట్రోల్ చేసి మోడీ హీరో అయ్యాడని అంతర్జాతీయ మీడియా కొనియాడింది. కానీ రెండో వేవ్ కు వచ్చేసరికి మోడీ పాలన సామర్థ్యం తేలిపోయిందని విమర్శిస్తున్నాయి.

భారత్ లో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. లక్షల కేసులు.. వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అంతర్జాతీయంగా భారత్ లోని కల్లోల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ లోని మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై తాజాగా అంతర్జాతీయ మీడియా మండిపడుతోంది. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ సమయంలో దేశంలో ఎన్నికలు పెట్టి రాజకీయ ప్రచారం చేయడం.. మహా కుంభమేళాలకు అనుమతులు ఇవ్వడం ఏంటని మోడీ సర్కార్ ను అంతర్జాతీయ మీడియా కడిగేస్తోంది. దీని వల్లే భారత్ లో కరోనా కోరలు చాస్తోందని అభిప్రాయపడుతున్నాయి.

న్యూయార్క్ టైమ్స్, లండన్ సండే టైమ్స్ ఇలా అన్ని దేశాల ముఖ్య పత్రికలు మోడీ ఫస్ట్ వేవ్ లో బాగా చేశాడని పొగిడాయి. ఇప్పుడు అవే మోడీని ఆడుకుంటున్నాయి. ‘మోడీకి పని తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ’ అని కడిగేస్తున్నాయి. అన్ని దేశాల ప్రముఖ పత్రికలన్నీ ఇప్పుడు భారత్ లో కరోనా కల్లోలం చూసి మోడీ మీదే రాస్తున్నాయి.  మీడియా మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన మోడీ ప్రతిసారి తనదే అప్పర్ హ్యాండ్ అని భావించాడు. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులతో ఆయన మేనేజ్ మెంట్ కల ఒట్టి కట్టుకథ అని తేలిపోయిందని పత్రికలు విమర్శిస్తున్నాయి. మోడీది ప్రచార ఆర్భాటమేనని.. కరోనాను కంట్రోల్ చేయలేకపోయాడని విమర్శలు గుప్పిస్తున్నాయి.
Tags:    

Similar News