ఏపీ విభజన కారణంగా జరిగిన నష్టాలెన్నో ఉన్నప్పటికీ.. వాటిల్లో ప్రధానమైన నష్టాల్లో ఒకటి.. ఏపీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లేకపోవటం. విభజన తర్వాత విదేశాలకు వెళ్లాలంటే అయితే హైదరాబాద్‌కో లేదంటే ముంబయి.. ఢిల్లీ.. చెన్నై వెళ్లి వెళ్లటమే కాదు.. ఏపీలోని ఎయిర్ పోర్ట్ లనుంచి నేరుగా విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. అయితే.. మోడీ క్యాబినెట్‌లో ఏపీకి చెందిన అశోక్ గజపతిరాజు విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించటంతో.. ఏపీలోని విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా వెంటనే దక్కుతుందని భావించారు.
అయితే.. ఏ పనైనా సరే.. క్రమపద్ధతిలోనే తప్పించి.. అంతకు మించిన వేగంతో సాధ్యం కాదన్న విషయం చాలా త్వరగానే అర్థమైంది. ఇందుకు తగ్గట్లే కాలగమనంలో మూడేళ్లు గడిచిన తర్వాత మాత్రమే విజయవాడకు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ హోదా ఇస్తూ కేంద్రమంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బెజవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఇవ్వటానికి మోడీ సర్కారుకుఏకంగా మూడేళ్లు పైనే పట్టిందని చెప్పాలి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో బెజవాడకు ఇంటర్నేషనల్ హోదా ఇవ్వాలని నిర్ణయించారు. విభజన నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల వృద్ధి.. విమానయాన సంస్థల నుంచి వస్తున్న డిమాండ్లు.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.
కేంద్ర క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని ట్వీట్ చేశారు. విజయవాడ విజయాల గడ్డగా అభివర్ణించిన ఆయన.. కేబినెట్ నిర్ణయంతో భారత అంతర్జాతీయ విమానాశ్రయాల క్లబ్‌లోకి చేరి ప్రజలకు స్వాగతం పలుకుతోంది.. ఏపీని ప్రజలు మరింత చేరువుగా తెలుసుకునే అవకాశం కల్పించనుందన్న వ్యాఖ్యను చేశారు. అంతర్జాతీయ హోదా కారణంగా 1150 మందికి ప్రత్యక్షంగా అంతకుమించి మరింతమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పక తప్పదు. కాకపోతే.. ఈ చేసేదేదో.. ముందే చేసి ఉంటే.. ఎంతోకొంత ప్రయోజనం ఉండేదనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/