అనుభవం అయితేనే కానీ తత్వం బోధపడదని పెద్దలు ఊరికే అనలేదు. ప్రస్తుతం ఈ సామెత వైసీపీ నేతలకు ఖచ్చింతంగా సరిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీలో మాటల తూటాలపై వైసీపీ అంతర్మథనం మొదలైందని అంటున్నారు. అనవసరంగా నోరు జారామని నాలుక కర్చుకుంటున్నారట. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. ఆ తర్వాత చంద్రబాబు కన్నీరుమున్నీరుగా విలపించడంతో ఆయనపై సానుభూతి వస్తోంది. ఇక్కడే వైసీపీ ఆలోచనలో పడిందట. అనవసరంగా గాలికి పోయే కంపను మెడకు తగిలిచ్చుకున్నామని వైసీపీ నేతలు తెగ బాధపడుతున్నారని చెబుతున్నారు. అంతా జరిగిన తర్వాత లెంపలేసుకుని ప్రయోజనం లేదని, ఆ పార్టీ సీనియర్ నేతలు నిట్టూర్పు విరుస్తున్నారట.
అసెంబ్లీలో జరిగిన ఘటన తర్వాత చంద్రబాబు మీడియా సమావేశంలో విలపించారు. ఆ తర్వాత చంద్రబాబు చేసిందంతా నాటకమని వైసీపీ శ్రేణులు కొట్టిపారేశాయి. అయితే వైసీపీ ఊహించిన దానికంటే చంద్రబాబుకు సానుభూతి రావడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగుతోందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును దూషించిన నలుగురు ఎమ్మెల్యేలను సీఎం జగన్ మందలించినట్లు తెలుస్తోంది. చంద్రాబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఆయన దుఖం ఇవన్నీ రాష్ట్రంలో మరోరూపు తీసుకుంటున్నాయి. చంద్రబాబుకు ఫోన్ చేసి పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న వైసీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందట. అనవసరంగా టీడీపీకి ఆయుధాన్ని ఇచ్చామని, ప్రజల్లో సానుభూతి వస్తుందేమోనని వైసీపీ నేతల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎప్పటి నుంచే చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పోనీ వీళ్లిద్దరూ సొక్కం వైసీపీ నేతలా అంటే అదికాదు. ఈ ఇద్దరూ పూర్వాశ్రమంలో టీడీపీ జెండా మోసినోళ్లే. నాని, వంశీ, చంద్రబాబుపై ఎప్పుడు మాట్లాడినా ప్రధానంగా ‘వెన్నుపోటు’అనే పదం లేకుండా ఉండదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుతో ఆపుతారా అంటే అదిలేదు లోకేష్ ను అనరాని మాటలు మాట్లాడుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నారని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. మొదట్లో నాని, వంశీ వ్యాఖ్యలను ప్రజలు చూసి చూడనట్లు వ్యవహరించారు. ఇప్పుడు నారా ఫ్యామిలీని వదిలి నందమూరు కుటుంబంపై పరుష పదజాలాన్ని ఉపయోగించడంపై జనాలు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో జరిగిన రభసను నందమూరి కుటుంబం తీవ్రంగా తప్పుబట్టింది. ఓ దశలో నానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. లాగిలాగి చివరకు నెత్తిమీదకు తెచ్చుకున్నామని వైసీపీ నేతలు తెగ బాధపడుతున్నారట. నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని సదరు నేతలకు వైసీపీ అధిష్టానం తలంటు పోసిందని చెబుతున్నారు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ వల్లభనేని వంశీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా బయట నుంచి విమర్శలు వచ్చాయి. అయితే చంద్రబాబు కానీ, నందమూరి కుటుంబం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు అసెంబ్లీలో అంబటి రాంబాబు, చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు వ్యాఖ్యలను ట్రోల్ చేసినప్పటికీ అంతిమంగా పార్టీకి ఇబ్బందేనని వైసీపీ నేతలు వాపోతున్నారని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే టీడీపీ కాస్త కోలుకుంటున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రధాన అస్త్రాలు మారుతాయని, దీన్ని వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని వైసీపీలో అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి సరిపోయింది. ఒక వేళ ఎన్నికలు ఉండిట్లే పరిస్థితి ఏమిటనే వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేసినా అవన్నీ సానుభూతి ముందు కొట్టుకుపోతాయని చెబుతున్నారు. ఇక నుంచి అయినా వ్యక్తిగత విమర్శలు చేయకుండా.. విధానపరంగా విమర్శించాలని వైసీపీ సీనియర్లు హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.