టెక్ ఫాగ్... అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంల బీజేపీ ప్రత్యర్థ పార్టీలు ఈ పేరు వినిపిస్తేనే వణుకుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ, అమిత్ షాల రాజకీయ తంత్రాల కంటే టెక్ ఫాగ్‌కే భయపడుతున్నాయి. బీజేపీ ఐటీ సెల్ ఈ టెక్ ఫాగ్ సాఫ్ట్ వేర్ వాడుతోందని... దీని సహాయంతో బీజేపీ ప్రాపగండా చాలా సులభమని చెబుతున్నారు.
అంతేకాదు.... వ్యక్తుల వాట్సాప్ అకౌంట్లను హాక్ చేసి వారి అకౌంట్‌ను వారికి తెలియకుండా క్లోన్ చేసి వారి కాంటాక్ట్ నంబర్లకు, వారున్న గ్రూపులకు బీజేపీ అనుకూల సమాచారం షేర్ చేయడం ఈ యాప్ వల్ల సాధ్యమవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్, ఓటీపీ అథెంటిఫికేషన్, కాప్చా వంటి ఎన్ని సెక్యూరిటీ పద్ధుతులు ఉన్నా వాటన్నిటినీ బైపాస్ చేసి ఈ సాఫ్ట్ వేర్ ఇతరు అకౌంట్లను హ్యాక్ చేస్తుందని అంటున్నారు.
బీజేపీ అనుకూల ప్రచారానికి... బీజేపీ వ్యతిరేకులపై సోషల్ మీడియాలో దాడి చేయడానికి, విమర్శలను తిప్పి కొట్టడానికి అన్నిటికీ ఈ యాప్ పనిచేస్తుందని... ఇదంతా ఆటోమేటిగ్గా జరిగిపోతుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
సోషల్ మీడియా ట్రెండ్స్ హైజాక్ చేయడానికి.... పెద్దగా వినియోగంలో లేని సోషల్ మీడియా అకౌంట్లను హైజాక్ చేసి వాడుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ పనికొస్తుందని టెక్ ఇండస్ట్రీకి చెందినవారు చెబుతున్నారు.
ఇదే నిజమైతే వచ్చే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీని తట్టుకోవడం విపక్షాల తరం కాదు.
పెర్సిస్టెంట్ సిసమ్స్, మొహల్లా టెక్ అనే సంస్థల నిర్వహణ, సాంకేతిక సహకారంతో బీజేపీ ఐటీ సెల్ ఈ యాప్ వాడుతోందని చెబుతున్నారు. మొహల్లా టెక్ సంస్థ ప్రముఖ సోషల్ మీడియా యాప్ షేర్ చాట్‌కి చెందినదని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో షేర్ చాట్ ఇన్వాల్వ్‌మెంట్‌పై ఆరోపణలు వస్తున్నాయి.
ఈ యాప్‌ను ఉపయోగించి ప్రొపగాండా చేస్తున్న టీంలను బీజేపీ యువమోర్చా సభ్యులు నడిపిస్తున్నారని... కంటెంట్ కూడా వారే ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా తృణమూల్, శివసేన నేతల నుంచీ టెక్ ఫాగ్ విషయంలో బీజేపీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, బీజేపీ మాత్రం ఇదంతా ఊహాజనితమని... బీజేపీ కానీ, దాని అనుబంధ సంస్థలు ఎలాంటి చట్ట వ్యతిరేక సాఫ్ట్ వేర్లు వాడడం లేదని చెబుతున్నాయి.
మరోవైపు బీజేపీతో అంటకాగుతున్న పార్టీలు కొన్ని వచ్చే ఎన్నికల నాటికి ఈ సాఫ్ట్ వేర్‌ను తాము కూడా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.