లైగర్ లో పెట్టుబడులు: కవిత, పూరీలపై ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత

Update: 2022-11-19 11:37 GMT
లైగర్ ప్రాజెక్ట్‌లో విదేశీ పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా దర్శకుడు పూరీ జగన్నాధ్ , నిర్మాత/హీరోయిన్ ఛార్మీలను విచారించింది. నిన్న విచారణ 12 గంటలకు పైగా సాగినట్లు సమాచారం.

పూరి సినిమాలో కేసీఆర్ కూతురు కవిత పెట్టుబడులు ఉన్నాయని.., లైగర్‌లో ఇతరుల పెట్టుబడులపై ఫిర్యాదు చేసింది తానేనని బక్కా జాడ్సన్ అనే కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. ఇదే విషయమై ఆయన గతంలో ఈడీకి ఫిర్యాదు చేశారు.

"కేసీఆర్ కూతురు కవిత, పూరీ జగన్నాథ్, ఛార్మీలపై ఈడీకి ఫిర్యాదు చేసింది నేనే. ఈ సినిమాని ఉపయోగించి వారంతా తమ నల్లధనాన్ని వైట్‌గా మార్చుకున్నారు. పూరీ, కవిత, విజయ్ దేవరకొండ కూడా ఒకటే కులానికి చెందినవారు" అని కాంగ్రెస్ రాజకీయ నాయకుడు జాడ్సన్ పేర్కొన్నారు.

తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఈ ప్రాజెక్టులో నిజంగా పెట్టుబడులు పెట్టారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నివేదికలు వెలువడిన తర్వాత పూరీపై ఈడీ చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. పూరితో కవితకు లింకులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యలో ఈ కేసు  మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

లైగర్ సినిమా ఇప్పటికే అట్టర్ ఫ్లాప్ అయి దర్శక నిర్మాతలు పూరి-చార్మిలను ముంచింది. అంతేకాదు.. ప్యాన్ ఇండియా హీరో అవుదామనుకున్న విజయ్ దేవరకొండ కలలను చిదిమేసింది. ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు.

పూరిని డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక కేసుల పాలు అవుతున్నారు.  పూరి అండ్ కో ఇప్పుడు ఈడీ విచారణను ఎదుర్కోవలసి వచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News