కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి పి.చిదంబరంకు కాలం కలిసి రావడం లేదు. నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఇంత దుర్భర పరిస్థితి ఏనాడు ఎదుర్కొని ఉండరు చిదంబరం. కేంద్రంలో ఓ చక్రం తిప్పన ఈ రాజకీయ నేత ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తూ కాలం గడుపుతున్నాడు. చేసిన పాపం ఊరికే పోదనే సామేత ప్రకారం అధికారం అడ్డుగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చిదంబరానికి అర్థమై ఉంటుంది. ఐఎన్ ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.
ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో చిదంబరానికి బెయిల్ చిక్కకపోవడంతో ఆయన పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. చిదంబరంకు బెయిల్ ఇవ్వకూడదన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఎంతో పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుడైన చిదంబరం సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనను కొట్టిపారేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఐఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమయ్యాయని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే.
ఈ కేసులో అరెస్టైన చిదంబరం ఆధారాలన్నింటినీ మాయం చేశారని కోర్టుకు విన్నవించారు. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. గతంలో చిదంబరం వేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు నిరాకరించింది. తీహార్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని వేసికున్న పిటిషన్‌ను కోర్టు గతంలో చిదంబరానికి వ్యతిరేక తీర్పు ఇచ్చింది. ఇక ఇప్పుడు బెయిల్ పిటిషన్ తిరస్కరణతో చిదంబరం మరికొంత కాలం తిహార్ జైలులోనే గడుపనున్నారు.