కాసేప‌ట్లో ఐఫోన్ 7 వ‌చ్చేస్తోంది..!

Update: 2016-09-07 09:31 GMT
మార్కెట్ లో ఎన్ని మోడ‌ల్స్ ఫోన్లు వ‌స్తున్నా... ఆపిల్ ఐఫోన్ డిమాండ్ ఏమాత్రం త‌గ్గ‌ద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు నిరూప‌ణ అవుతూనే ఉంది! టెక్ శావీల‌ను ఎంతగానో ఊరిస్తున్న ఐఫోన్ 7 - ఐఫోన్ 7 ప్ల‌స్ మోడ్స‌ల్స్ బుధ‌వారం ప్ర‌పంచాన్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోయంలో ఈ ఫోన్ల ఆవిష్క‌రణ‌ అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. ఆ రెండు మోడ‌ల్స్ ఫోన్ల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆపిల్ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అద‌రగొట్టే ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్లు ఉంటాయ‌ని టెక్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇత‌ర మొబైల్ త‌యారీ కంపెనీల‌న్నీ స్క్రీన్ సైజుల్ని పెంచుకుంటూ పోతుంటే.. ఆపిల్ మాత్రం ఈ ఏడాది కూడా ఎలాంటి మార్పులూ చేయ‌డం లేదు. ఐఫోన్ 7 మోడ‌ల్ 4.7 అంగుళాలు ఉండ‌బోతోంది. 7 ప్ల‌స్ మోడ‌ల్ స్క్రీన్ సైజ్ 5.5. గ‌తంలో విడుద‌ల చేసిన 6 - 6 ఎస్ మోడ‌ళ్ల‌తో పోల్చితే ఇవి మ‌రింత స్లిమ్ గా ఉంటాయ‌ని చెబుతున్నారు. 7 ప్ల‌స్ మోడ‌ల్‌ కి 12 మెగాపిక్స‌ల్ డ్యుయెల్ కెమెరాలు ఉండోబోతోంద‌ట‌. అలాగే, 7 మోడ‌ల్‌ కి ఒక‌టే సెన్స‌ర్ ఉన్న 12 ఎంపీ కెమెరా ఉంటుంద‌ని అంటున్నారు. ఇంత‌వ‌ర‌కూ లిమిటెడ్ క‌ల‌ర్స్ లో మాత్ర‌మే ఉన్న యాపిల్ డివైజ్ ల‌లో రెండు కొత్త రంగులు చేర‌బోతున్నాయి. డీప్ బ్యూ - స్పేస్ బ్లాక్ క‌ల‌ర్స్‌ లో కూడా ఈ కొత్త ఫోన్లు రాబోతున్నాయి. ఇప్ప‌టికే ఆపిల్ త్రీడీ ట‌చ్ బాగా పాపుల‌ర్ అయింది. ప్రెష‌ర్ సెన్సిటివ్ ట‌చ్ హోమ్ బ‌ట‌న్ మ‌రిన్ని ఫీచ‌ర్ల‌తో స‌రికొత్త ఫోన్ల‌లో మెరుగుప‌ర‌చార‌ట‌.

గ‌తంలో వ‌చ్చిన ఎ9 చిప్ సెట్ చాలా ఫాస్ట్ అని టెక్ నిపుణులు కొనియాడారు. అయితే, ప్ర‌స్తుతం మోడల్స్‌ లో ఎ10 చిప్ సెట్ వ‌స్తోంది. అంటే, మ‌రింత వేగం అన్న‌మాట‌! ఐఫోన్ల‌లో 32 జీబీ వేరియంట్ ఇంత‌వ‌ర‌కూ లేదు. ఐఫోన్ 7 - 7 ప్ల‌స్ మోడ్స‌ల్స్ లో 32 జీబీ నుంచి 256 జీబీ వేరియంట్ వ‌ర‌కూ కొత్త‌గా రాబోతున్నాయి. ఎక్కువ బ్యాట‌రీ సామ‌ర్థ్యం - వాట‌ర్ రెసిస్టెంట్‌ - బ్లూ టూత్ ద్వారా ప‌నిచేసే హెడ్ ఫోన్స్‌ - టైప్ సీ ఇంట‌ర్ ఫేస్‌... ఇంకా చాలాచాలా కొత్త ఫీచ‌ర్ల‌తో ఐఫోన్ 7 - 7 ప్ల‌స్ లు ముస్తాబై వ‌స్తున్నాయి. ఈ ఊరించే కొత్త ఆపిల్ ఐఫోన్లు అమెరికాలో ఈ నెల 15 నుంచి 19 తేదీల మ‌ధ్య‌లో వినియోగ‌దారుల ముందుకు వ‌స్తాయి. మ‌న‌దేశంలో ఈనెల 26 నుంచి ఆపిల్ అమ్మ‌కాలు మొద‌లౌతాయ‌ని తెలుస్తోంది. ఇక‌, ధ‌ర విష‌యానికొస్తే... 32 జీబీ ఫోన్ల ధ‌ర మ‌న‌దేశంలో రూ. 63 వేల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇది అంచ‌నా ధ‌ర మాత్ర‌మే - మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

మార్కెట్ లో ఎన్ని కొత్త‌వి వ‌స్తున్నా ఆపిల్ ఫోన్ల‌ను ఉన్న ఆద‌ర‌ణ ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌న‌డానికి తాజా గ‌ణాంకాలే సాక్ష్యం. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా అమ్ముడైన సెల్ ఫోన్ గా అవ‌త‌రించింది ఐఫోన్ 6 ఎస్ మోడ‌ల్‌. ద్వితీయ త్రైమాసికంలో 1.42 కోట్ల ఫోన్లు అమ్ముడు పోయాయ‌న‌ని స్ట్రాట‌జీ అనలిస్ట్ ఒక నివేదిక‌లో తెలిపింది. అంటే, మొత్తం మొబైల్ మార్కెట్ లో 4 శాతం ఇది. ఐఫోన్ 6 మోడ‌ల్ కూడా 2 శాతం మార్కెట్ క్యాప్చ‌ర్ చేసింది! ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికానికి ఐఫోన్ 6 మోడ‌ల్స్ ఎన‌భై ఐదు ల‌క్ష‌ల‌కు పైగా అమ్ముడుపోయాయి. అత్య‌ధిక అమ్మ‌కాల్లో తొలి రెండు స్థానాల్లోనూ ఐఫోన్లే ఉంటే... మూడో స్థానంలో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 7 నిలిచింది. గ‌డ‌చిన ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆపిల్ అమ్మ‌కాదు 1 శాతం పెరిగాయి. కొత్త‌గా మార్కెట్లోకి వ‌స్తున్న మోడ‌ల్స్ కూడా రికార్డులు సృష్టిస్తాయ‌ని సంస్థ వ‌ర్గాలు ఆశాజ‌న‌కంగా ఉన్నాయి.
Tags:    

Similar News