ఐపీఎల్​ 2020 చాంపియన్స్​ ఢిల్లీ క్యాపిటల్స్​..లీప్​ ఇయర్​ ప్రిడిక్షన్ తేల్చిచెప్పిందా?

Update: 2020-11-09 13:10 GMT
ఐపీఎల్​ అంటేనే జనాలకు ప్రత్యేకమైన మోజు. ఐపీఎల్​ ఆటగాళ్లు, ఆ సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుత లాక్​డౌన్​లో కొంచెం హడావుడి తగ్గింది కానీ.. మాములుగా అయితే ఐపీఎల్​ సీజన్​ కోసం కొట్లాది మంది ఎదురుచూస్తుంటారు. కరోనా జాగ్రత్తలతో మొదలైన ఐపీఎల్​ 2020 భారీ అంచనాలతో మొదలైంది. అనూహ్య మలుపులతో పాయింట్​ టేబుల్స్​ పట్టిక రోజుకో తీరున మారుతూ ఆసక్తి రేకెత్తించింది. మొదట్లో పాయింట్ల పట్టికలో చివరన ఉన్నవారు ఆఖరికి పై వరసకు వచ్చేశారు.

చాంపియన్​గా నిలుస్తుందనుకున్న చెన్నై సూపర్​ కింగ్స్​ ప్లే ఆఫ్స్​ కు కూడా చేరుకోలేకపోయింది. అనుకోని రీతిలో మరికొన్ని జట్లు ప్లే ఆఫ్స్​ కు చేరుకున్నాయి. లీప్​ ఇయర్​ ప్రిడిక్షన్​ ప్రకారం ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ చాంపియన్​ గా నిలుస్తుందని కొంతమంది చెబుతున్నారు. అసలు ఈ లీప్​ ఇయర్​ ప్రిడిక్షన్​ ఏమిటో తెలుసుకుందాం.. ఐపీఎల్​ ప్రారంభించిన సంవత్సరం నుంచి లీప్​ ఇయర్​ లో కొత్తవాళ్లే చాంపియన్లుగా నిలిచారు. దాన్ని ఆధారంగా తీసుకొని ఈ ఏడాది (2020) లీప్​ ఇయర్​ కాబట్టి .. గతంలో ఒక్కసారి కూడా చాంపియన్లుగా నిలవలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్​ విజేతగా నిలుస్తారని భావిస్తున్నారు.

నిన్న (ఆదివారం) జరిగిన మ్యాచ్​లో ఢిలీ క్యాపిటల్స్​ గెలుపొంది ఫైనల్ కు ఎంపికైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్..మొత్తం 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. 190 పరుగుల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 172 పరుగుల వద్దే ఆగిపోయింది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 172 పరుగులు చేసింది. విజయం
లీప్ ఇయర్ ప్రిడిక్షన్ ఏమిటో వివరంగా తెలసుకుందాం..  ఐపీఎల్ టోర్నమెంట్‌కు, లీప్ ఇయర్‌కు అవినాభావ సంబంధం ఉన్నది. ప్రతి లీప్ ఇయర్‌ లోనూ ఓ కొత్త ఛాంపియన్‌ను విజేతగా నిలిచింది. ఐపీఎల్ ఆరంభమైంది కూడా లీప్ ఇయర్‌ లోనే. 2008లో ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. అది లీప్ ఇయర్. ఆ లీప్ సంవత్సరంలో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది. 2008 తరువాతి లీప్ ఏడాది 2012. ఆ సీజన్‌ లో కోల్‌ కతా నైట్ రైడర్స్ చాంపియన్‌ గా ఆవిర్భవించింది.

2016 లీప్ సంవత్సరంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ కొత్త ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. 2016 తరువాతి లీప్ ఇయర్ ఇదే. లీప్ ఇయర్ ట్రెడీషన్‌ ను పరిగణనలోకి తీసుకుంటే.. ఢిల్లీ  విజయం సాధించడం ఖాయమని ఢిల్లీ క్యాపిటల్స్​  అభిమానులు అంటున్నారు. ఈ ప్రిడిక్షన్లు అన్నింటిని బలమైన ముంబై ఇండియన్స్​ జట్టు పటాపంచలు చేస్తుందని.. బలమైన బ్యాటింగ్ - బౌలింగ్​ ఉన్న ముంబై ఇండియన్స్​ ఈ సారి తిరుగులేని ఆధిక్యాన్ని సాధించి విజయం సాధిస్తుందని ఆ జట్టు అభిమానులు అంటున్నారు. ఎవరి అంచనాలు నిజమవుతాయో, ఎవరి ప్రిడిక్షన్లు ఎంత మేరకు ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలంటే రేపు (మంగళవారం) అర్ధరాత్రి వరకు వేచిచూడాల్సిందే.
Tags:    

Similar News