ఈ సారి ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా రాణించడం లేదు. పటిష్ఠమైన బౌలింగ్ ఉన్నప్పటికీ .. మిడిలార్డర్ సరిగ్గా లేక సన్‌రైజర్స్ ఇబ్బంది పడుతోంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. 171 పరుగులు సాధించింది. అయినప్పటికీ చెన్నై ఈ లక్ష్యాన్ని చాలా అలవోకగా చేధించింది. ప్రస్తుతం చెన్నై జట్టు ఆధిపత్యాన్ని కనబరుస్తుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే నిన్నటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ .. రికార్డుల మోత మోగించాడు.
ఈ మ్యాచ్ లో వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ హాఫ్ సెంచరీ వార్నర్‌కు 50 వది కావడం గమనార్హం. అది మాత్రమే కాక ఈ మ్యాచ్ లో కొట్టిన సిక్స్ తో మొత్తం ఐపీఎల్లో 200 సిక్సులు కొట్టాడు. అంతేకాక టీ20 క్రికెట్లో 10 వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా కూడా వార్నర్ రికార్డులకెక్కాడు. టీ 20లో 13,839 పరుగులతో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉండగా.. 10,694 పరుగులతో పొలార్డ్ రెండో స్థానంలో .. 10, 488 పరుగులతో షోయబ్ మాలిక్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
కాగా నిన్నటి మ్యాచ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకొని ఫ్యాన్స్ కు నిరాశ మిగిల్చింది. బ్యాటింగ్ లో దూకుడుగా ఆడిన సన్‌రైజర్స్ బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. మనీశ్ పాండే 61 పరుగులు, డేవిడ్ వార్నర్ 55 పరుగులు, కేన్ విలియమ్ సన్ 10 బంతుల్లోనే 26 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ బౌలింగ్ పటిష్ఠంగా ఉంటుంది కాబట్టి.. ధోనిసేనను తేలిగ్గానే కట్టడి చేయవచ్చని అంతా భావించారు. కానీ ఈ లక్ష్యాన్ని ధోనీ సేన ఉఫ్ అని ఊదిపారేసింది. కేవలం 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతొ చెన్నై ఈజీగా గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై అగ్రస్థానంలో కొనసాగుతోంది. రుతురాజ్ గైక్వాడ్. డుప్లెసిస్ దూకుడుగా ఆడటంతో సన్‌రైజర్స్ ను ఈజీగా ఓడించింది.