ఐపీఎల్​: టాప్​ ప్లేస్​ కోసం ధోనీ.. కోహ్లీ ఫైట్​..!

Update: 2021-04-29 11:30 GMT
గత ఏడాది ప్లే ఆప్స్​ కు వెళ్లలేక ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశలో ముంచెత్తిన సీఎస్ కే  ఆ సారి మాత్రం దూసుకెళ్తున్నది. ఓపెనర్  డూప్లెసిస్  దూసుకుపోతున్నాడు. ఇక ఆల్​రౌండర్​ జడేజా కూడా మంచి ఫామ్​ లో ఉన్నాడు. దీంతో ప్రస్తుతం ఆ జట్టు పాయింట్​ టేబుల్ లో టాప్ లో ఉంది. గత ఏడాది చాంపియన్​ గా నిలిచిన ముంబై ఇండియన్స్​  ఈ సారి ఎందుకో  ఆశించిన మేర ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టులోని మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ దారుణంగా విఫలం అవుతున్నారు. దీంతో ముంబై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నది.

ఇక కోహ్లీ సేన ఆర్​సీబీ కూడా దుమ్ములేపుతున్నది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్​సీబీ అగ్రస్థానం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఆ జట్టులోని దేవ్​దత్​ పడిక్కల్​, మాక్స్​వెల్​, మిస్టర్​ 360 డివిలియర్స్​ ఫుల్​ స్వింగ్​ లో ఉన్నారు. వీళ్లకు తోడు ఈ సారి బౌలర్​ హర్షల్​ పటేల్​ సైతం బాగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం పర్పుల్​ క్యాప్​ రేసులో టాప్​లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్​ లో అతడికి గణనీయంగా వికెట్లు పడుతున్నాయి. దీంతో అగ్రస్థానం కోసం ఆర్​సీబీ.. చెన్నై సూపర్​ కింగ్స్​ పోటీపడుతున్నాయి.

మరోవైపు ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్​ కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తున్నది. గత ఏడాది ఫైనల్​ వరకు వెళ్లిన ఢిల్లీ చాంపియన్​ షిప్​ ను చేజార్చుకున్నది. దీంతో ఈ సారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నది. కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో రిషబ్​ పంత్​ బాధ్యతలు తీసుకున్నాడు. పంత్​ కూడా మెరుగైనా ప్రదర్శన ఇస్తున్నాడు. జట్టులోని సభ్యులందరినీ  సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక టాప్​ ప్లేస్​ కోసం మాత్రం సీఎస్​కే .. ఆర్​సీబీ పోటీపడుతుండగా.. ముంబై మాత్రం ఈ సారి కాస్త వెనకబడింది.

ఇక హైదరాబాద్​, రాజస్థాన్​ రాయల్స్​, కేకేఆర్​ వరస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పంజాబ్​ కూడా వాళ్ల బాటలోనే పయనిస్తున్నది. ఈ జట్లు ప్లే ఆప్స్​ కు వెళ్లాలంటే మాత్రం వరుస విజయాలు నమోదు చేయాల్సిందే. ఈ సారి ఆర్​సీబీ, సీఎస్​కే, ఢిల్లీ , ముంబై జట్లే ప్లే ఆప్స్​ కు వెళ్లే అవకాశం ఉంది. ఏవైనా అద్భుతాలు జరిగితేనే మిగతా జట్లకు అవకాశాలు ఉంటాయి.
Tags:    

Similar News