ఏబీ డివిలియర్స్.. మైదానంలో 360 డిగ్రీల కోణంలో బంతిని కొట్టగల అసామాన్య బ్యాట్స్ మన్. సురేశ్ రైనా.. ఎడమచేతి వాటం కళాత్మక ఆటగాడు. సచిన్ టెండూల్కర్ ఎడమచేత్తో బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో రైనాను చూసి తెలుసుకోవచ్చు. క్రిస్ గేల్.. ఇతడి గురించి చెప్పేదేలే..? విధ్వంసానికి మారు పేరు అనుకోండి.. తుఫానుకు పర్యాయపదం అనుకోండి.. క్రికెట్ గ్రౌండే ఇతడికి దాసోహం అంటుంది.
నిజం చెప్పాలంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను జనరంజకం చేసిన పది మంది ఆటగాళ్ల పేర్లు చెప్పమంటే ఈ ముగ్గురు టాప్ 5లో ఉంటారు. టాప్10 రన్ స్కోరర్లలోనూ వీరు ఉన్నారు. అలాంటి వీరు ముగ్గరూ లేకుండా తొలిసారిగా ఐపీల్ జరుగనుండడం విశేషం. అంటే అభిమానులు చాలా వినోదాన్ని మిస్ కానున్నట్లు స్పష్టమవుతోంది.
ముగ్గురూ ఒకేసారి మిస్..
ఇంకొంత కాలం ఆడగలిగే స్థితిలో ఉండి కూడా ఈ ముగ్గురూ ఒకేసారి మిస్ కావడం మరింత పెద్ద లోటు అనే చెప్పాలి. వీరిలో రైనా 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. డివిలియర్స్ 2018లోనే గుడ్ బై చెప్పాడు. గేల్ మాత్రం ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నాడు. 2021 సీజన్ కు ముందు రైనా వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడంతో పాటు లీగ్ కు దూరంగానూ ఉన్నాడు.
ఈ సీజన్ లో అతడిని ఎవరూ తీసుకోలేదు. కనీస ధర రూ.2కోట్లే అయినా పట్టించుకోలేదు. ఇందుకు వ్యక్తిగత కారణాలు కొంత ఉన్నా.. రైనా ఫామ్ లో లేకపోవడం, సీరియస్ క్రికెట్ ఆడకపోవడం ఎంపికకు అవరోధంగా మారింది. దీంతో రైనా లీగ్ కు దూరమయ్యాడు. ఇకఏబీడీ నిరుడు లీగ్ మొత్తం ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతోనే అతడి సత్తా తగ్గిందనే అనుమానాలు మొదలయ్యాయి.
నాలుగేళ్ల క్రితమే 2018లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి డివిలియర్స్ అందరినీ ఆశ్చర్యపర్చాడు. అయితే, దీనికి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు రాజకీయాలే కారణమన్న విమర్శలు వచ్చాయి. దీనికితోడు వన్డే ప్రపంచ కప్ ముంగిట డివిలియర్స్ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. కప్ అనంతరం తిరిగి వస్తానన్నప్పటికీ పెద్దగా స్పందన కరువైంది. ఏబీడీ 2018 నుంచి ఐపీఎల్ లో ఆడాడు. తదుపరి రెండు ,మూడు సీజన్లు ఆకట్టుకున్నా నిరుడు విఫలమయ్యాడు.
దీంతోనే గతేడాది చివర్లో మొత్తం క్రికెట్ కే వీడ్కోలు పలికాడు. విరాట్ కోహ్లికెప్టెన్సీ వదిలేసిన నేపథ్యంలో.. ఏబీడీ దూరం కావడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కష్ట కాలమే.గేల్ రిటైర్మెంట్ చెప్పకున్నా..క్రిస్ గేల్ ది మరో రకం కథ.
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు లీగ్ క్రికెట్ లోనూ కొనసాగుతున్న అతడు ప్రపంచవ్యాప్తంగా టోర్నీలో పాల్గొంటుంటాడు. ఇప్పటివరకు 20పైగా లీగ్ జట్లకు ఆడిన అనుభవం అతడిది. అయితే, మూడేళ్ల క్రితమే తాను రిటైర్ అవుతున్నట్లు చెప్పి హడావుడి చేశాడు. కానీ, ఎటూ తేల్చలేదు. వెస్టిండీస్ తరఫున వంద టెస్టులు పైగానే ఆడి, వన్డేలు, టి20ల్లోనూ వెస్టిండీస్ జట్టుకువిజయాలు అందించిన గేల్.. 2000 సంవత్సరానికి ముందు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి ఇప్పటికీ ఆడుతున్న ఏకైక క్రికెటర్ కావడం విశేషం.
ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు కూడా ఇతడిదే. అయితే, గేల్ కు వెస్టిండీస్ బోర్డు నుంచి రిటైర్మైంట్ పై ఆశించినంతగా గౌరవ మర్యాదలు దక్కడం లేదు. దీంతో అది పెండింగ్ లో పడింది. అంతేకాక గేల్ ఐపీఎల్ లో ఈ ఏడాది పేరు రిజిష్టర్ చేసుకోలేదు. లీగ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వీరుడిగా రికార్డున్న గేల్ కు ఇలాంటి అవమానాలు కొత్తేం కాదు. 2018 సీజన్ లో ఏ జట్టూ అతడిని తీసుకోలేదు. అనూహ్యంగా బెంగళూరుకు ఓ ఆటగాడు అవసరం పడడంతో గేల్ రంగంలోకి దిగాడు. ఆ సీజన్ లో దుమ్ముదులిపాడు.