ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినా.. బయో బబుల్ ను ఛేదించుకొని మరీ ఐపీఎల్ అటగాళ్లను టచ్ చేసింది కొవిడ్ వైరస్. దీంతో.. ఒకరి తర్వాత ఒకరుగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కోల్ కతా, చెన్నై ఆటగాళ్లు కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చెన్నై జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కొవిడ్ బారిన పడడంతో.. ఆ జట్టు మొత్తం క్వారంటైన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే.. బాలాజీకి వైరస్ సోకిన మర్నాడే.. బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీకి వైరస్ నిర్ధరణ కావడం జట్టు సభ్యులందరినీ ఆందోళనకు గురిచేసింది. కొవిడ్ పాజిటివ్ రిజల్ట్ రావడానికి రెండు రోజుల ముందు టీమ్ సభ్యులు సురేష్ రైనా, డుప్లెసిస్ తో చాలా సేపు మాట్లాడినట్టు సమాచారం. వీరితోనే కాకుండా.. మరికొంత మందితోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో.. వీరి పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కీపర్ వృద్ధిమాన్ సహాలోనూ కొవిడ్ లక్షణాలు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే.. అంతకు ముందే అతను పలువురు ఆటగాళ్లతో దగ్గరగా ఉన్నట్టు సమాచారం. మరి, ఈ జట్లలో ఇంకా ఎంత మంది కొవిడ్ బారిన పడతారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మరో మూడునాలుగు రోజులు గడిస్తే తప్ప.. అసలు విషయం తేలే అవకాశం లేదు.