నాకు ఐపీఎల్లే ముఖ్యం బంగ్లా క్రికెటర్​ సంచలన ప్రకటన..!

Update: 2021-03-22 16:30 GMT
బంగ్లాదేశ్​ జట్టు క్రికెటర్​ షకీబ్ అల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు శ్రీలంక జట్టుతో ఆడే టెస్ట్​ సీరిస్​ లకంటే ఐపీఎల్​ మ్యాచ్​లే ముఖ్యమంటూ పేర్కొన్నాడు. దీంతో అతడి ఆరోపణలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై షకీబ్​ క్లారిటీ కూడా ఇచ్చాడు. 'నాకు టెస్ట్​ సీరిస్​లు ముఖ్యం కాదు.. ఇండియాలో ఆడే ఐపీఎల్​ మ్యాచ్​ లే ముఖ్యం'అంటూ వ్యాఖ్యానించాడు. 'వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఇవే మా చివరి రెండు టెస్టు మ్యాచ్ లు.. మేం ఫైనల్ కు వెళ్తామని అనుకోవడం లేదు. పాయింట్ల టేబుల్ లో మేం చివర్లోనే ఉన్నాం. అదేం పెద్ద తేడా చూపిస్తుందనుకోవడం లేదు'ఈ ఏడాది ఇండియా లో టీ20 వరల్డ్​ కప్​ జరుగనున్నది. ఈ మ్యాచ్ లు కూడా మాకు ఎంతో ముఖ్యం. అంటూ షకీబ్​ పేర్కొన్నాడు.

ఈ మేరకు అతడు ఓ లెటర్​ రాశారు. అయితే షకీబ్​పై ఆరోపణలు రావడంతో మాట మార్చారు. ' నా లెటర్​ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఐపీఎల్​కు ప్రాక్టీస్​ చేస్తాను అని మాత్రమే పేర్కొన్నాను. కానీ కొందరు నా వ్యాఖ్యలు వక్రీకరించారు' అంటూ ఆయన పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ కు ప్రిపేర్ అవుతున్నానని షకీబ్​ చెప్పాడు. ఏప్రిల్ 21నుంచి మే 3వరకూ జరగనున్న ఈ సీరిస్ లకు షకీబ్ అందుబాటులో ఉండడని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ అక్రమ్ చెప్పాడు.అయితే అక్రమ్​పై షకీబ్​ మండిపడుతున్నాడు. అతడు నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నాడని పేర్కొన్నారు.

వరల్డ్ కప్ టీ20లో అదే ప్రత్యర్థులపై అవే గ్రౌండ్ లో తలపడటానికి రెడీగా ఉన్నా. మా బంగ్లాదేశ్ టీం మేట్స్ తో ఆ అనుభవాన్ని పంచుకుంటా. మరే క్రికెట్ బోర్డు ఐపీఎల్ జరుగుతున్నంత కాలం ఇంటర్నేషనల్ మ్యాచ్ లు నిర్వహించాలని అనుకోదు. కానీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అలా చేయలేదు. మేం మాత్రమే శ్రీలంకతో ఆడేందుకు రెడీగా ఉన్నాం.షకీబ్​ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలంగా మారాయి. అతడికి దేశం తరఫున ఆడటం కంటే ఐపీఎల్​లో ఆడటమే అంత ముఖ్యమైందా? అంటూ బంగ్లాదేశ్​కు చెందిన కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే షకీబ్​ మాత్రం తన లెటర్​ను మీడియా వక్రీకరించిందని పదే పదే చెబుతున్నారు.
Tags:    

Similar News