జమ్మూ కశ్మీర్ లో ఉగ్రమూకల సంఖ్య నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. గోతికాడ నక్కలా కాచుకున్న ముష్కరులు ...భారత్ పై దాడులకు తెగబడేందుకు అనేక కుయుక్తులు పన్నుతుంటారు. భారత జవాన్లను ఎదుర్కొనే దమ్ములేక దొంగదెబ్బ తీస్తుంటారు. అనేక మంది అమాయక యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసి తమ రక్తాదాహానికి బలి చేస్తుంటారు. తాజాగా, `ఉగ్ర` వలలో ...భారత్ లో పనిచేస్తోన్న జమ్మూ కశ్మీర్ కు చెందిన ఐపీఎస్ సోదరుడు ఒకరు చేరడం తీవ్ర కలకలం రేపింది. ఈశాన్య భారతంలో విధులు నిర్వర్తిస్తోన్న ఐపీఎస్ అధికారి సోదరుడు హిజ్బుల్ ముజాహిద్దీన్ లో చేరాడన్న వార్త సంచలనం రేపింది. ఆ ఐపీఎస్ సోదరుడు షమ్సుల్ హక్ తుపాకీ పట్టుకొన్న ఫోటోను హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ఈ విషయం బట్టబయలైంది.
2012 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఇనాముల్ హక్ ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. అతడి సోదరుడు షమ్సుల్ హక్ కశ్మీర్ యూనివర్శిటీలో బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ షమ్సుల్ హక్ మధ్యలోనే చదువు మానేశాడు. గత మే 22న అతడు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా హక్ హిజ్బుల్ ముజాహిద్దీన్ లో చేరినట్టు ఫొటోలు విడుదల కావడంతో అతడు ఉగ్రవాదిగా మారినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. షమ్సుల్ ఫోటో కింద బుర్హాన్ సాని అనే పేరు ఉండడం విశేషం. ఆదివారం నాడు హక్ తో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ లో నియమించుకున్నవారి ఫోటోలను ఆ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. రెండేళ్ల క్రితం ఎన్ కౌంటర్ లో మృతి చెందిన బుర్హాన్ వనీ వర్ధంతి రోజు ఈ ఫోటోలు విడుదలయ్యాయి. ఉగ్రవాది బుర్హాన్ వానీ రెండవ వర్ధంతి సందర్భంగా.. చాలా మంది యువకులు అతడికి నివాళులు అర్పించేందుకు వనీ సొంత గ్రామానికి ర్యాలీగా వెళుతుండగా భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో ఘర్షణలు చెలరేగాయి.