ఆ దేశంలో అత్యంత సంపన్నుడికి మరణశిక్ష

Update: 2016-03-07 22:30 GMT
ఈ మధ్యన విడుదలైన కృష్ణగాడి వీర ప్రేమ గాథలో ఒక డైలాగ్ అదిరిపోయింది. ఒక ఊరి ఫ్యాక్షనిస్టు పెళ్లికి వెళ్లిన సందర్భంగా.. విలన్ బ్యాచ్ ఆ ఇంట్లోకి వెళ్లే సందర్భంలో విలన్ బ్యాచ్ లో ఒకడు.. జాగ్రత్తగా ఉండండి ఇది పెద్దారెడ్డి ఇల్లు అంటే..? అంటే.. అని మరొకడు అసహనంతో ప్రశ్నిస్తాడు. దానికి మొదటోడు బదులిస్తూ.. ఈ ఊరికి మన భాయ్ లాంటోడన్న మాట అంటూ.. పెద్దారెడ్డి ఏ రేంజ్ వాడో చెప్పే ప్రయత్నం చేస్తాడు.

ఇప్పుడు అలాంటి పోలికే పోలవాల్సిన పరిస్థితి. మనదేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎంత సంపన్నుడో.. ఇరాన్ దేశంలో బాబక్ ఇంన్జానీ అంతే సౌండ్ పార్టీ. ఒకవిధంగా చెప్పలంటే ఇరాన్ దేశానికి అంబానీ లాంటోడన్న మాట. అలాంటి అపర కుబేరుడికి ఆ దేశం మరణ శిక్ష విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ.. అతగాడు ఏమైనా.. హత్యలు వగైరా.. వగైరా చేశాడా అంటే.. అలాంటిదేమీ లేదు. జస్ట్ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దానికే.. మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మన రూపాయిల్లో చెప్పాలంటే.. ఇరాన్ కుబేరుడు చేసిన అవినీతి సుమారు రూ.20వేల కోట్లు (కాస్త అటుఇటుగా) ఉంటుంది. ఇంత భారీ మొత్తాన్ని అక్రమంగా కూడబెట్టినందుకు కోర్టు అతగాడికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బాబక్ మీద ఆరోపించిన ఆరోపణలన్నీ రుజువు కావటంతో ఆయనకు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇరాన్ కోర్టు వెల్లడించింది. అంతేకాదు.. సదరు ఇరాన్ కుబేరుడికి మరణశిక్షతో పాటు.. అవినీతితో సంపాదించిన సొమ్మునంతా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలంటూ తీర్పు ఇచ్చారు.

ఈ వ్యవహారాన్ని ఇక్కడ కట్ చేసి.. మన దేశానికి వస్తే.. బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని దాదాపుగా రూ.4లక్షల కోట్లకు పైనే ఎగొట్టిన వీర సంపన్నులకు ఎలాంటి శిక్ష విధించాలి? అవినీతికే ఉరిశిక్ష అంటూ ఇరాన్ లో తీసుకున్న నిర్ణయం లాంటిదే మన దేశంలో అమలు చేయాలని చూస్తే..? వామ్మో.. ఆ టాపిక్ గురించి మాట్లాడుకోకపోవటమే మంచిదేమో.
Tags:    

Similar News