దూకుడు నిర్ణయాలు, వివాదాస్పద చర్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ ఇది. ఓ వైపు ఆయన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా మరోవైపు ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ ఖాసిం సొలైమని బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఖాసింను అమెరికా దారుణంగా హతమార్చిందని భావిస్తున్న ఇరాన్ ఈ ఘటనలో ట్రంప్‌పై కేసు నమోదు చేసి ఇప్పటికే అరెస్ట్ వారంట్ జారీ చేసింది. దీనికి కొనసాగింపుగా ట్రంప్‌ను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తిచేసింది. కాగా, ఇరాన్ అరెస్ట్ వినతి వల్ల ట్రంప్‌కు ఇప్పటికిప్పుడే ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెప్తున్నారు.
జనవరి మూడో తేదీన బాగ్దాద్‌లో జనరల్ ఖాసిం సొలైమనిని చంపిన ఘటనలో ట్రంప్‌తోపాటు మరో 30 మందికి పైగా వ్యక్తుల ప్రమేయం ఉందని అరెస్టు వారెంట్ జారీ చేసారు. దీనిపై తాజాగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది ఆ దేశం. ఇరాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్కాసిమెహర్ దీనిపై స్పందిస్తూ ట్రంప్‌తోపాటు ఇతరులకు "రెడ్ నోటీసు" ఇవ్వమని కోరినట్లు వెల్లడించారు. ట్రంప్ తన అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ప్రాసిక్యూషన్‌ను ఇరాన్ కొనసాగిస్తుందని అల్కాసిమెహర్ పేర్కొన్నారు. తమ అభ్యర్థనను గౌరవించి అరెస్టు వారెంట్ జారీ చేస్తే... ఇంటర్‌పోల్ జారీ చేసిన అత్యున్నత స్థాయి అరెస్ట్ అభ్యర్థనగా నిలుస్తుందని భావిస్తున్నారు. టెహరాన్ అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికాను ట్రంప్ ఉపసంహరించుకున్నప్పటి నుంచి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పెరిగిన సంగతి తెలిసిందే.
మరోవైపు , ఇంటర్‌పోల్ నిబంధనల ప్రకారం, ఫిర్యాదుదారు నుంచి అభ్యర్థన స్వీకరించిన తరువాత సభ్యదేశాలతో సమాచారాన్ని పంచుకోవడంపై ఇంటర్‌పోల్ కమిటీ సమావేశమై చర్చిస్తుంది. నోటీసులను బహిరంగపరిచే ఎలాంటి అవసరం ఇంటర్‌పోల్‌కు లేదు. అయినప్పటికీ కొన్ని దాని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. ఇక ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్‌పై ఆరెస్ట్ వారంట్ జారీపై ఫ్రాన్స్‌లోని లియాన్‌లో ఉన్న ఇంటర్‌పోల్ స్పందించలేదు.