ఇరాన్ లో కరోనా బాధితులు 2.5 కోట్లు - ఇరాన్ ప్రెసిడెంట్

Update: 2020-07-19 00:30 GMT
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. శనివారం సాయంత్రం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఇరాన్ జనాభా 8 కోట్లు కాగా వారిలో 2.5 కోట్లు కరోనా బారిన పడటం అంటే అది చాలా పెద్ద విషయం. అంతేకాదు, మరో 3.5 కోట్ల మంది కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అయితే, ఇవన్నీ అంచనాలే.

ఎందుకంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ఆధారంగా ఇరాన్ లో ఇప్పటివరకు 269,440 మందికి కరోనా సోకింది. కానీ అంచనా మాత్రం 2.5 కోట్లు ఉందంటే... ఇక ఇతర దేశాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా... ఇటలీ కంటే ముందుగా ఈ దేశం తీవ్రంగా ప్రభావితమైంది. ఇటలీతో పాటు ఇతర యూరోప్ దేశాలు మెల్లగా కోలుకుంటున్నాయి గాని ఈ అంటువ్యాధితో తీవ్రంగా నష్టపోయిన మధ్యప్రాచ్య దేశంగా ఇరాన్ రికార్డులకు ఎక్కింది.

ఇప్పటివరకు ఇరాన్ లెక్కల ప్రకారం 14,000 మంది చనిపోయారు. 2 లక్షల మంది ఆస్పత్రుల పాలై కోలుకున్నారు. రౌహాని వ్యాఖ్యలు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. వినడానికి ఇబ్బంది కరంగా ఉన్నా ఈ కఠిన వాస్తవాన్ని అంగీకరించాల్సిందే. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రతి ఒక్కరికి కరోనా వస్తుందేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News