ఇరాన్ ప్రవేశ పెట్టిన అణ్వాయుధాల నిషేద ఒప్పదం నుంచి అమెరికా బయటకు వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య పరమైన - ఆర్థిక - సామాజిక సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అగ్రరాజ్యం అమెరికా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ భూభాగంలోకి తమ దేశానికి చెందిన డ్రోన్ ను పంపింది. ఇది చూసిన ఇరాన్ సైన్యం దానిని పేల్చి వేసింది. ఈ చర్యతో అమెరికా - ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ విషయంలో అమెరికా చేస్తున్న పనులకు ఇరాన్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.
తమ డ్రోన్ ను కూల్చివేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ లోని కొన్ని ప్రదేశాల్లో కాల్పులు జరపాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తయిన తర్వాత ట్రంప్ వెనక్కి తగ్గారు. దీనికి కారణం ఈ కాల్పుల వల్ల ఇరాన్ లోని చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని వచ్చిన రిపోర్టులే. వీటి వల్ల ఇరాన్ తో సంబంధాలు తెంచుకుని స్ట్రాంగ్ గా ఉండాలని భావించిన ట్రంప్ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ స్పందించింది. అంతేకాదు, అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి అబ్బాస్ మౌసవీ ఈ మేరకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుత పరిస్థితుల్లో మరింత అగ్గిని రాజేస్తున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘‘అమెరికా మా దేశం మీద దాడి చేసే పరిస్థితే వస్తే.. మేము కూడా అంతే స్థాయిలో స్పందిస్తాం. ఆ దేశమే కాదు.. మా దేశ సరిహద్దులోకి ఎవరు ప్రవేశించినా వాళ్లకు తగిన గుణపాఠం చెబుతాం. మాపై ఎలాంటి చర్యలు చేసినా చూస్తూ ఊరుకోం’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.