ఆ దేశ ఉపాధ్యక్షురాలికి కొవిడ్ వైరస్ సోకింది

Update: 2020-02-28 05:15 GMT
ప్రపంచ వ్యాప్తంగా కలవరపెడుతున్న కొవిడ్ వైరస్ కారణంగా ఇప్పటివరకూ మూడు వేల మంది వరకూ మరణించారు. ఈ మహ్మమారి కారణంగా మరణించిన వారంతా సామాన్యులే కాదు.. కొందరు ప్రముఖులు ఉన్నారు. కానీ.. పవర్ ఫుల్ స్థానాల్లో ఉన్న వారు ఈ వైరస్ బారిన పడింది లేదు. తాజాగా ఒక దేశ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ప్రముఖ నేతకు కొవిడ్ వైరస్ సోకిన వైనం షాకింగ్ గా మారింది.

చైనాలో మొదలైన ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పుడు పలు దేశాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్య ఆసియా దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు ఈ పిశాచి వైరస్ పట్టేసింది. చైనా తర్వాత వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇరాన్ నిలుస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో 26 మంది కొవిడ్ వైరస్ కారణంగా మరణించారు. అన్నింటికి మించిన ఆ దేశ ఉపాధ్యక్షురాలిలో ఒకరైన మసౌమె ఎబ్తేకర్ కు కొవిడ్ పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.

ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహానీ కేబినెట్ లో కీలకమైన నేతగా చెప్పే ఎబ్తేకర్.. మహిళా.. కుటుంబ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తుంటారు. అత్యున్నత స్థానంలో ఉన్న వారు అత్యంత అప్రమత్తంగా ఉండటమే కాదు.. కొవిడ్ లాంటి ప్రమాదకర వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు భిన్నంగా దేశ ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న నేత కొవిడ్ బారిన పడటం సంచలనంగా మారింది.

ఇప్పటివరకూ కొవిడ్ వైరస్ పలు దేశాలకు వ్యాపించినా.. ఎక్కడా కూడా దేశ ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న నేతకు సోకిన దాఖలాలు లేవు. అయితే.. ఇరాన్ ఆరోగ్య శాఖ ఉప మంత్రి హరిర్చికి కొవిడ్ వైరస్ వ్యాపించటం.. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలికి పాజిటివ్ రావటం చూస్తే.. ఇరాన్ లోని హై ప్రొఫైల్ లో ఉండే ప్రముఖులకు కొవిడ్ వైరస్ ముప్పు పొంచి ఉందని చెప్పక తప్పదు. దేశ ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న ఎబ్తేకర్ కు కొవిడా పాజిటివ్ అని తేలటంతో.. ఆమెతో పని చేసే మరికొంతమంది అధికారులు.. సిబ్బంది తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు.
Tags:    

Similar News