కొండల్ని పిండి చేసే శక్తి టీనేజర్ల సొంతం. వారి ఆసక్తులు ఎంటి? ఎలా ఉన్నాయి? వారి దృష్టి వేటి మీద ఎక్కువగా ఉంది?వారేం చేయటానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు? లాంటి అంశాల మీద ఒక అభివృద్ధి చెందిన దేశంలో సర్వే చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? అన్నది ఆసక్తికరమైన అంశం. ఐర్లాండ్ లాంటి ప్రాశ్చాత్య దేశంలో టీనేజర్ల ఫోకస్ దేనిమీద ఉందో తెలుసుకోవటానికి ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లడైన ఫలితాలు చూసిన వారు షాక్ తినే పరిస్థితి. పేరుకు పిల్లలే కానీ.. వారి ఫోకస్ అంతా సెక్స్ మీద ఉండటం అక్కడి పెద్దలు ఏ మాత్రం జీర్ఱించుకోలేకపోతున్నారు.
అదే సమయంలో తాగుడు.. సిగిరెట్ లాంటి వాటికి దూరంగా ఉండటం గమనార్హం. ఐర్లాండ్ లోని 18 ఏళ్ల వయసు లోపు పిల్లల అలవాట్లపై ఇటీవల ఒక భారీ సర్వే చేపట్టారు. దాదాపు 230కి పైగా స్కూళ్లల్లో నిర్వహించిన ఈ సర్వేలో బయటపడిన అంశాలు పలువురిని ముక్కు మీద వేలు వేసుకునేలా చేశాయి. ఎందుకంటే.. సర్వేలో పాల్గొన్న విద్యార్థినీవిద్యార్థుల్లో ఎక్కువమంది ఇప్పటికే సెక్స్ అనుభవాలు ఉన్నట్లుగా తేలింది. అయితే.. సంపన్న వర్గాల పిల్లలతో పోలిస్తే.. పేద.. మధ్యతరగతి విద్యార్థులలో సెక్స్ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
వీళ్లు ఎంతలా ముదిరిపోయారంటే.. సెక్స్ చేసే సమయంలో కండోమ్ లు.. గర్భం రాకుండా పిల్స్ వినియోగించటంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం.. ఆ అవగాహన చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో 27 శాతం మంది తమకు సెక్స్ అనుభవం ఉన్నట్లుగా చెప్పేశారు. ఇది గతంతో పోలిస్తే 3 నుంచి 5 శాతం ఎక్కువని చెబుతున్నారు. సెక్స్ మీద ఆసక్తి పెరగటం.. అదే సమయంలో మద్యం.. సిగిరెట్ మీద ఆసక్తి తగ్గటం.. డైటింగ్ మీద జాగ్రత్తలు తీసుకోవటం.. నాన్ వెజ్ కంటే వెజ్ మీద దృష్టి నిలపటం లాంటి కూడా పెరిగినట్లు గుర్తించారు. ఒక్క సెక్స్ యావ తప్ప మిగిలిన అంశాల్లో దేని విషయంలోనూ వేలెత్తి చూపించలేని విధంగా ఉన్న ఐర్లాండ్ టీనేజర్లు సెక్స్ యావ ఇప్పుడా దేశ పెద్దల్లో ఆందోళనకు గురి చేస్తోంది.