ఇర్మా దెబ్బ‌కు మాయ‌మైన అట్లాంటా స‌ముద్రం

Update: 2017-09-11 04:01 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాకు వ‌ణికిస్తూ.. కోట్లాది మందికి మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తున్న ఇర్మా హ‌రికేన్‌కు సంబంధించి మ‌రో షాకింగ్ విష‌యాన్ని చెప్పాలి. త‌న తీవ్ర‌త‌తో ఇప్ప‌టికే ప‌లు దేశాల‌కు భారీ న‌ష్టం వాటిల్లేలా చేసిన ఇర్మా పుణ్య‌మా అని అరుదైన ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది.

చూడ చ‌క్క‌ని అందాల‌తో.. చిన్న చిన్న ద్వీపాల‌తో మ‌న‌సుల్ని దోచుకునే క‌రీబియ‌న్ దీవుల్లోని బ‌హ‌మాస్ దేశం ఇర్మా కార‌ణంగా కుదేల్ అయ్యింది. ఇర్మా పుణ్య‌మా అని కొంత‌సేపు అట్లాంటా స‌ముద్రం క‌నిపించకుండా పోయింది. నిత్యం క‌నువిందు చేసే స‌ముద్రం కంటికి కనిపించ‌కుండాపోయే స‌రికి షాక్ గా మారింది.

ఇర్మా విధ్వంసం త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఎంత‌గా న‌ష్ట‌ప‌రిచింద‌న్న విష‌యాన్ని చూసేందుకు వ‌చ్చిన వారికి.. క‌నుచూపు మేర బీచ్ క‌నిపించ‌కుండా పోవ‌టంతో అవాక్కు అయ్యే ప‌రిస్థితి.

దీనికి సంబంధించిన ఒక వీడియోను బ‌హ‌మాస్ వాసి ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేయ‌గా.. ప‌లు మీడియా సంస్థ‌లు ఈ వీడియోను పోస్ట్ చేశాయి. ఇర్మా ధాటికి మాయ‌మైన అట్లాంటా స‌ముద్రం దాదాపు 13 గంట‌ల త‌ర్వాత తిరిగి య‌థాస్థితికి చేరుకుంది.

తీవ్ర‌మైన హ‌రికేన్‌.. భారీ సునామీల స‌మ‌యంలో స‌ముద్రంలోని నీటిని వెన‌క్కు లాక్కోవ‌టం క‌నిపిస్తుంటుంది. అలాంటి అరుదైన ప‌రిస్థితి తాజాగా చోటు చేసుకోవ‌టంతో బ‌హ‌మాస్ లోని అట్లాంటా స‌ముద్రం కొన్ని గంట‌ల పాటు క‌నిపించ‌కుండా పోయింది. హ‌రికేన్ అత్య‌ధిక ఒత్తిడికి గురి చేసి నీటిని త‌న వైపు లాక్కోవ‌టంతో ఇలాంటి ప‌రిస్థితి చోటు చేసుకుంది. త‌ర్వాత ఎప్ప‌టి మాదిరే నీరు వ‌చ్చేసిన వైనం అంద‌రిని అవాక్కు అయ్యేలా చేస్తోంది.
Full View

Tags:    

Similar News