దొంగతనం చేసిన దొంగలు.. చోరీ చేసిన సొత్తును తీసుకొని పారిపోతారు. కానీ.. ఈ ఉదంతంలో దొంగలు మాత్రం రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా వ్యవహరించి.. పోలీసులు పలు సందేహాలు కలిగేలా చేశారు.
వరంగల్ జిల్లాకు చెందిన గోవర్థనగిరికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బంధువుల ఇంటికి వెళ్లిన సదరు ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు.. ఇంట్లోని విలువైన వస్తువుల్ని దోచేసుకోవటంతో పాటు.. ఆ ఇంట్లోని బీరువాను దొంగలించేశారు. అనంతరం.. బీరువాను తమతో తీసుకెళ్లిన దొంగలు.. సమీపంలోని పట్టాల మీద పడేశారు. ఆ మార్గం మీద వెళుతున్న దక్షిణ్ ఎక్స్ ప్రెస్.. బీరువాను ఢీ కొట్టింది.
దీంతో.. పెద్ద శబ్ధం చోటుచేసుకోవటంతో.. ఏమైందని భయపడిన ట్రైన్ డ్రైవర్ రైలును ఆపి.. పరిశీలించగా.. బోగీల మధ్యలో ఇరుకున్న బీరువా రేకుల్ని గుర్తించి.. వాటిని తొలగించి.. రైలును నడిపాడు. ఈ ఉదంతంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దొంగలు తప్పించుకోవటం కోసం తెలివిగా.. బీరువాను తీసుకొచ్చి పట్టాల మీద పెట్టారని.. దాన్ని ఢీ కొన్నప్పుడు వచ్చే శబ్ధంతో రైలును ఆపటం ఖాయమని.. అదే సమయంలో గుట్టుచప్పుడు కాకుండా రైలు ఎక్కేందుకే దొంగలు ఈ ప్లాన్ చేశారన్న వాదన వినిపిస్తోంది. దీనికితోడు.. ఈ ఘటన తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో చోటు చేసుకోవటం గమనార్హం.
ఏది ఏమైనా ఇకపై రైల్వే అధికారులు.. రైలు డ్రైవర్లు.. మరింత జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని.. తాజా ఉదంతం చెప్పకనే చెబుతుందని చెప్పక తప్పదు. ఈ రోజు రైలు ఆపటం కోసం పట్టాల మీద బీరువా పెట్టిన దుండగలు.. రేపొద్దున రైల్లో దోపిడీకి.. ఇలాంటి ఎత్తులే వేస్తే..? అన్నది ఇక్కడ ప్రశ్న. అందుకే.. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? ఎలా ఎదుర్కోవాలన్న అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.