రాజకీయాల్లో ఐరన్ లెగ్గులు ఉంటాయా. ఏమో ఐరన్ లెగ్గులు ఉంటే వారే రాజకీయాల్లో భ్రష్టు పట్టిపోతారు. అయితే కొన్ని లెగ్గులతో వారి చుట్టూ ఉన్న వారు కూడా నాశనం అయిపోతారు. సినీరంగలో ఐరెన్ లెగ్ సెంటిమెంట్ నిండుగానే ఉంది. వరసగా సినిమాల్లో హీరో అయినా హీరోయిన్ అయినా ఫెయిల్యూర్స్ తెస్తే వారిని పట్టుకుని ఐరన్ లెగ్ అని గట్టి ముద్ర వేస్తారు. ఇక రాజకీయాల్లో చూస్తే ఒకనాడు ఎన్టీయార్ ద్వితీయ కళత్రం లక్ష్మీ పార్వతి మీద ఆ ముద్ర వేసి ఆమెను ముందు పెట్టి వెనకాల ఎన్టీయార్ ని అధికారం నుంచి కూలదోశారు.
ఆ తరువాత కాలంలో ఆర్కే రోజా అనే సినీ హీరోయిన్ రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె టీడీపీలో రెండు సార్లు పోటీ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి రాలేదు, దాంతో ఆమెది ఐరన్ లెగ్ అనేశారు తమ్ముళ్ళు. అలా అనిపించారు తెర వెనకవాళ్ళు మొత్తానికి వైసీపీలో చేరిన రోజా అక్కడ రెండు సార్లు గెలిచి చివరకు మంత్రి కూడా అయ్యారు. అంటే ఇపుడు ఆమె గోల్డెన్ లెగ్ అనుకోవాలా.
ఇక లక్ష్మీపార్వతి విషయం తీసుకుంటే రాజకీయంగా సక్సెస్ కాకపోయినా ఒకసారి పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఇపుడు మరో మారు ఏపీ రాజకీయాల్లో ఐరన్ లెగ్ డైలాగ్ మోత మోగుతోంది. లేటేస్ట్ గా చంద్రబాబు వరసగా మూడు జిల్లాల్లో టూర్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ని ఉద్దేశించి కొత్త డైలాగ్ ఒకటి వదిలారు.
అదేంటి అంటే జగన్ ది ఐరెన్ లెగ్ అని. ఆయన ఇలా సీఎం అయ్యాడో లేదో అలా ఏపీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. లేకపోతే ఈ కరోనా మహమ్మారి ఏంటి, ఈ అప్పులేంటి, ఈ ఆర్ధిక సంక్షోభం ఏంటి, అసలు ఏపీలో ఏ రంగం అయినా బాగుందా అంటూ బాబు గట్టిగానే తగులుకున్నారు. జగన్ ఇది ఐరన్ లెగ్. ఆయన్ని ఎంతో తొందరగా వదిలించుకోకపోతే అంత ఎక్కువగా ఏపీకి నష్టం వాటిల్లుతుంది అని కూడా అనుభవం నిండా పండిన బాబు గారు ఏపీ జనాలకు ఫుల్ వార్నింగ్ ఇచ్చేశారు.
మొత్తానికి జగన్ కి ఐరన్ లెగ్ ట్యాగ్ పెట్టేసి జనంలోకి చంద్రబాబు వెళ్తున్నారు. దానికి ఆయన చెబుతున్న కారణాలు కూడా సహేతుకంగా ఉన్నాయని జనాలు నమ్మితే కనుక ఏపీ రాజకీయాల్లో ఐరన్ లెగ్ అన్న ముద్ర గట్టిగానే జగన్ కి పడిపోతుంది.
ఏపీలో ఇపుడు సంక్షోభభరితమైన రాజకీయం ఉందని కూడా అంతా భావిస్తున్నారు. అయితే తన అనర్ధాలకు ఏలికలు కారణం అని జనాలు తిట్టుకోవడం సహజమైనదే. ఇక కరోనా వంటి మహమ్మారులు కేవలం ఏపీకి మాత్రమే రాలేదు. అలాగే జగన్ సీఎం కాక ముందే ఏపీకి నిండా అప్పులు ఉన్నాయి. ఇక పన్నుల బాదుడు అన్నది ప్రతీ ప్రభుత్వంలో ఉంటుంది.
మరో వైపు చూస్తే పారిశ్రామిక ప్రగతి అన్నది దేశంలోనే మందగమనంలో ఉంది. కాస్తా పలుకుబడి పట్టున్న రాష్ట్రాల్లో ఒకటో అరో పరిశ్రమలు వస్తున్నాయి. ఏపీకి అవి రావాలీ అంటే చాలా ఏళ్ళు పట్టవచ్చు, మొత్తం జాతీయ అంతర్జాతీయ పరిణామాలు కూడా దానికి అనుకూలించాలి. ఇవన్నీ ఆర్ధిక పారిశ్రామిక రంగాల నిపుణుల విశ్లేషణలు.
మరి ఇలాంటివి జనాలు పోల్చి చూసి తమ గతిని, దైన్యానికి జగన్ పూర్తిగా కారణం కాదు అనుకుంటారా లేకపోతే సకల పాపాలకూ ఆయననే కేంద్ర బిందువుగా చేసి చూపెడుతున్న టీడీపీ మాటలను, ప్రత్యేకించి చంద్రబాబు తెచ్చి పెట్టిన ఐరన్ లెగ్ ట్యాగ్ ని నమ్మి యాంటీ అవుతారా. అంటే ఏమో ఏమైనా జరగవచ్చు.
ప్రజలు పారే నది లాంటి వారు. కుదురుగా వారి భావాలు ఎపుడూ ఒకేలా ఉండవు. వారికి మొహం మొత్తడానికి అట్టే సేపు కూడా పట్టకపోవచ్చు. తమ ఇంట్లో పిల్లి లేవలేదనో, లేక తమ కంచంలో నంజుకునేందుకు ఉల్లి పాయ లేదనో కోపంతో మా పాలిట ఐరన్ లెగ్ జగనే సుమా అని భ్రమించి భావించి మండిపడితే మాత్రం జగన్ సర్కార్ కి చిక్కులు వచ్చినట్లే.
క్యాచీగా ఉందని మాత్రమే ఈ డైలాగ్ ని చంద్రబాబు ఊరకే వాడడంలేదు, దాని వెనక పవర్ హీటూ తెలిసే యూజ్ చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు వ్యూహంలో ఐరన్ లెగ్ అన్నది పాశుపతాస్త్రం. దాన్ని జగన్ మీద ఫస్ట్ టైమ్ ప్రయోగిస్తున్నారు. వేయి మాటలేల ఒక్క ఐరన్ లెగ్ ట్యాగ్ చాలు, జగనేమిటో జనమే తెలుస్తారు అన్నది బాబు మార్క్ ప్లాన్. మరి జనాలు ఐరన్ లెగ్ స్టాంప్ కొడతారా. వెయిట్ అండ్ సీ.