బాలీవుడ్ స్టార్ వ్యాధి ఏంటో చెప్పాడు

Update: 2018-03-16 13:45 GMT
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు గత కొన్ని వారాలుగా అంతు చిక్కని అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పలు రూమర్స్ వ్యాపిస్తుండడంతో.. తను పేరు తెలియని వ్యాధితో బాధపడుతున్నానని.. చికిత్స తీసుకుంటున్నానని.. అన్ని విషయాలను తనే వెల్లడిస్తానని.. అప్పటివరకూ ఎవరూ రూమర్స్ వ్యాప్తి చేయవద్దని చెబుతూ.. ఈ నెల 5వ తేదీన సోషల్ మీడియా సాక్షిగా పేద్ద లేఖ రాశాడు ఇర్ఫాన్ ఖాన్.

10 రోజులు గడిచిపోయినా ఈ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో.. మళ్లీ ఇవాళ తన వ్యాధి గురించిన వివరాలతో పలకరించాడు ఇర్ఫాన్ ఖాన్. ఏ అడ్డంకులు లేని జీవితం.. మనం కోరుకున్నవి ఇవ్వనుంది అంటూ మార్గరెట్ మిచెల్ కొటేషన్ ను రాసిన ఇర్ఫాన్ ఖాన్.. 'అనుకోనివి జరిగినపుడే మనం ఎదుగుతాం. గత కొన్ని రోజులుగా ఇదే జరిగింది. నాకు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ సోకిందంటూ డాక్టర్లు డయాగ్నైజ్ చేశారు. అంగీకరించేందుకు ఇది కష్టమే అయినా.. నా చుట్టూ ఉన్న వారి ప్రేమ నాకు ఎంతో శక్తిని ఇస్తోంది' అన్నాడు ఇర్ఫాన్ ఖాన్.

'ఈ వ్యాధి కారణంగా దేశం వదిలి ప్రయాణం చేయాల్సి వస్తోంది. మీ అందరూ నా కోసం విషెస్ చెప్పడం కొనసాగించడం. న్యూరో అన్నంత మాత్రాన మెదడుకు సంబంధించినది కాదు. రీసెర్చ్ చేసేందుకు గూగుల్ చేసేయడం చాలా తేలిక. నా మాటల కోసం ఎదురుచూసే వారికి .. త్వరలోనే మళ్లీ కొన్ని కొత్త కథలను చెప్పేందుకు వెనక్కు వస్తానని ఆశిస్తున్నాను' అంటూ ఇర్ఫాన్ ఖాన్ చేసిన ట్వీట్.. అందరినీ కంటతడి పెట్టించేస్తోంది.
Tags:    

Similar News