24 శాఖ‌ల ఓట్లు త‌ల‌సాని వార‌సుడికే!

Update: 2019-04-04 11:52 GMT
ఏపీ - తెలంగాణ డివైడ్ త‌ర్వాత కేసీఆర్ కేబినెట్ లో త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కి ద‌క్కిన గుర్తింపు తెలిసిందే. సినిమావాళ్ల‌కు తొలి నుంచి ఎంతో సుప‌రిచితుడిగా ఉండి.. క‌ళారంగం అడిక్ష‌న్ ఉన్న నాయ‌కుడిగా త‌ల‌సానిని వెంట‌నే సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ప్ర‌క‌టించారు. ఆ క్ర‌మంలోనే సినీరంగంతో ఆయ‌న నెర‌పిన సాన్నిహిత్య ం అన్ని విధాలా వ‌ర్క‌వుటైంది. ఈ రంగంలో 24 శాఖ‌ల కార్మికులు స‌హా ప‌రిశ్ర‌మ పెద్ద‌లంద‌రితో త‌ల‌సాని ఎంతో స‌న్నిహితంగా ఉంటారు. వీట‌న్నిటినీ మించి సినిమా వేడుక‌లు, ప‌బ్లిక్ ఫంక్ష‌న్ల‌కు ఆయ‌న్ని పిల‌వాలే కానీ అస్స‌లు కాద‌ని అన‌రు. సినిమా వాళ్ల కుటుంబాల్లో ఈవెంట్ల‌కు పిలిచినా వెళ్లొస్తుంటారు. అలా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు స‌న్నిహితుడిగా ఉండే ఆయ‌న వ్య‌క్తిత్వ ం అంద‌రికీ న‌చ్చుతుంది. పైగా రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం సినీప‌రిశ్ర‌మ ఎటూ త‌ర‌లి వెళ్లిపోకుండా త‌ల‌సాని తీసుకున్న జాగ్ర‌త్త‌లు అన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్ ఆంధ్రాకు త‌ర‌లి వెళ్ల‌కుండా సినీరంగం పెద్ద‌ల్ని బుజ్జ‌గించ‌డంలోనూ ఆయ‌న పాచిక పారింది. టాలీవుడ్ పెద్ద‌ల‌కు, వారి ఆస్తుల‌కు ఎలాంటి భంగం వాటిల్ల‌కుండా కాపాడ‌తామ‌ని ప్రామిస్ చేసి నిల‌బెట్టే ప్ర‌య‌త్న ం చేశారు. అందుకే రెండోసారి గెలిచిన కేసీఆర్ మ‌రోసారి త‌ల‌సానికి సినిమాటోగ్ర‌ఫీ మంత్రిత్వ శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు.

ఇప్పుడు ఆయ‌న వార‌సుడి వంతు. త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ వార‌సుడు సాయికిర‌ణ్ యాద‌వ్ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్ లో ఉన్న సినిమావోళ్ల ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా అత‌డికి ప‌డేలా వ్యూహాన్ని ర‌చించారు. సినీప‌రిశ్ర‌మ‌కు అత్య ంత స‌న్నిహితుడు, ఆప్తుడు అయిన‌ త‌ల‌సాని కుమారుడు కాబ‌ట్టి 24 శాఖ‌లు గిప్పిట్లో ఉన్న ఫెడ‌రేష‌న్ సైతం అత‌డికి గంప‌గుత్త‌గా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భ ంగా ఇప్ప‌టికే హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో సాయికిరణ్ యాద‌వ్ ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో మీట్ & గ్రీట్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. నేడు మ‌రోసారి ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లోనూ సాయికిర‌ణ్ యాద‌వ్ ప‌లువురు సినీపెద్ద‌ల్ని క‌లిసి ఆశీర్వాదాలు అందుకున్నారు.

అనంత‌రం నేటి మ‌ధ్యాహ్న ం ఫిలింఫెడ‌రేష‌న్ 24 శాఖ‌ల కార్మికులు సాయికిర‌ణ్ యాద‌వ్ కి మ‌ద్ధ‌తును ప్ర‌క‌టిస్తూ హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో పాత్రికేయుల‌తో స‌మావేశం అయ్యారు. శ్రీ‌నివాస్ అన్న ఎంతో స‌న్నిహితుడిగా ఉన్నారు. ఆయ‌న వార‌సుడిగా సాయికిర‌ణ్ యాదవ్ ప‌రిశ్ర‌మ విష‌యంలో స్ప ందిస్తున్న తీరు, ప‌రిణ‌తి మాకు ఎంతో ముచ్చ‌ట‌గొలిపింది. అందుకే ఆయ‌న‌కు మ‌ద్ధ‌తునిస్తున్నాం అని తెలిపారు. ఈ స‌మావేశంలో ద‌ర్శ‌క‌సంఘం త‌ర‌పున ఎన్.శంక‌ర్, ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు కొర‌మ వెంక‌టేష్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు స‌హా అన్నిర‌కాల ఎల‌క్ష‌న్స్ లో త‌ల‌సానికి అండ‌గా నిలిచాం. ఆయ‌న కుమ‌రుడికి ఇప్పుడు అండ‌గా నిలుస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News