రాజకీయమంతా ఇంకా ఆయన చుట్టూనేనా ?

Update: 2021-07-04 08:30 GMT
తెలుగురాష్ట్రాల్లో రాజకీయం భలే విచిత్రంగా ఉంది. రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నవారు రెండు రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు. అయితే వారెవరి చుట్టు తిరగని రాజకీయం 12 ఏళ్ళ క్రితం చనిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చుట్టూ తిరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఏదో రూపంలో రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ వైఎస్సార్ పేరు రాజకీయాల్లో నానుతునే ఉంది.

తెలంగాణా రాజకీయాలకు సంబంధించి వైఎస్సార్ ను ఓ విలన్ లాగ మంత్రులు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో ఏపిలో వైఎస్సార్ పేరును హీరోగా చిత్రీకరిస్తున్నారు. ఒకే అంశంపై విరుద్ధమైన రాజకీయానికి కారణం ఏమిటంటే జల జగడాలే. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పుడు తెరపైకి వచ్చినా ముందుగా ప్రస్తావనకు వచ్చేపేరు వైఎస్సార్ దే.

నిజానికి తన హయాంలో ఇపుడున్న తెలంగాణాలోను ఏపిలో కూడా అనేక ప్రాజెక్టులను వైఎస్ టెకప్ చేశారు. జలయజ్ఞం పేరుతో చాలా ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. అయితే 2009లో రెండోసారి సీఎం అయిన కొద్ది రోజులకే  హఠాత్తుగా వైఎస్ మరణించటంతో ప్రాజెక్టుల పనులన్నీ నెమ్మదించాయి. తెలంగాణా ఉద్యమం ఒక్కసారిగా ఊపందుకోవటంతో ప్రాజెక్టుల పనులు జరగలేదు.

నిజంగా వైఎస్సే ఉండుంటే చాలా ప్రాజెక్టులు పూర్తయిపోయేవేమో కూడా. అప్పట్లో వైఎస్సార్ ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఇఫుడు తెలంగాణా మంత్రులు అభ్యంతరం చెబుతుండటమ ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు జగన్ చేస్తున్నదేమంటే ఆ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచటమే. దీనికే తెలంగాణా మంత్రులు అభ్యంతరం చెబుతున్నారంటే మరి తెలంగాణాలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులకు కూడా అనుమతులు లేవు. మొత్తానికి ప్రస్తుత రాజకీయమంతా వైఎస్ చుట్టూ తిరుగుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
Tags:    

Similar News