ఇప్పటిదాకా కథ వేరు, ఇకపై కథ వేరు అని రాజకీయాలకు సంబంధించి తరుచూ వినిపించే మాట. మరోసారి మునుగోడు ఎన్నికల్లో అదే మారుమోగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి కానీ లేదా అదే స్థాయిలో పనిచేయాలనుకుంటున్న బీజేపీ కానీ... సీటు మాదే అంటున్న కాంగ్రెస్ గానీ ఊగిపోతున్నాయి. అయితే, ఇక్కడో ట్విస్ట్ చోటుచేసుకుంది. కవితపై వచ్చిన ఆరోపణలపై ఇంతవరకూ రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఇంత పెద్ద ఆరోపణపై రేవంత్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేయనున్నారన్న వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. ఇకపై బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ బాగానే సిద్ధం అవుతోంది.
ఇంతవరకూ ఉన్న పోరును మొత్తం తమకు అనుగుణంగా మార్చుకునేందుకు చూస్తోంది. బీజేపీ నడుపుతున్న మైండ్ గేమ్ లో పావు కాకుండా ఉండాలని ప్రజలకు విన్నవిస్తోంది.
కాంగ్రెస్ మాత్రం మీరిద్దరూ కొట్టుకుంటూ ఉండండి అంటూ సెలంట్ గా ప్రజల్లో దూసుకుపోతోంది. అందులో భాగంగా ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం ఒకటి చేస్తున్నది. కవిత ఇమేజ్ డ్యామేజ్ కావడంతో టీఆర్ఎస్ కాస్త తడబడింది. బలంగా తన వాయిస్ వినిపించాలని, నేరారోపణలు వస్తున్నప్పుడు వాటిని నింద లేకుండా తుడుచుకోవాలని చూస్తోంది. కానీ ఒకటి జరిగేలోపు బీజేపీ ఇంకో ట్విస్ట్ ఇస్తూ కేసీఆర్ కు ట్విస్ట్ ఇస్తోంది.
అయితే ఇదంతా బీజేపీ నడిపిస్తున్న డ్రామా అని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీమాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సరే బీజేపీ తాను డిపాజిట్లు తెచ్చుకోలేకపోయిన చోట టీఆర్ఎస్ ను బదనాం చేసినంత మాత్రాన తాను హీరోయి అయిపోగలదా? అనేది పెద్ద అనుమానం.
చివరకు వీరిద్దరు తమలో తాము కొట్టుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం సైలెంటుగా ప్రజల కాళ్లు మొక్కి ఓట్లు అడుగుతూ వెళ్తోంది. మరి జనాలకు ఈ నాన్సెన్స్ ఇష్టమా? కాంగ్రెస్ సైలెంట్ వర్క్ ఇష్టమా? ఏమో కాలమే చెప్పాలి.